ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

చోడవరం
చోడవరం

2014 సాధారణ ఎన్నికలలో చోడవరం నియోజకవర్గంలో టిడిపి మరోసారి గెలిచింది. టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు(బాబు) రెండోసారి కూడా తన సమీప ప్రత్యర్ధి, వైసిపి మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై గెలుపొందారు. ధర్మశ్రీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసిపిలో చేరారు.  సన్యాసి రాజుకు 909 ఓట్ల ఆధిక్యత లభించింది. 
చోడవరం నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐలు కలిసి నాలుగుసార్లు, టిడిపి ఆరుసార్లు, కెఎల్పీ, స్వతంత్ర, జనతాపార్టీలు ఒక్కొక్కసారి, మరో ఇండిపెండెంటు గెలుపొందారు. 
చోడవరంలో వేచలపు, పాలవెల్లి రెండుసార్లు, జి.ఎర్రునాయుడు మూడుసార్లు, బలిరెడ్డి సత్యారావు రెండుసార్లు, ఇప్పుడు సన్యాసి రాజు రెండుసార్లు విజయం సాధించారు. 2004లో ఇక్కడ గెలిచిన గంటా 1999లో అనకాపల్లి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014లో భీమిలి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సత్యారావు గతంలో మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.