ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

రాయదుర్గం
రాయదుర్గం

2014 సాధారణ ఎన్నికలలో రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం నుంచి డిపి సీనియర్ నేత, మాజీ ఎంపి కాల్వ శ్రీనివాసులు గెలిచారు. ఆయన సిట్టింగ్ వైసిపి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై 1827 ఓట్ల తేడాతో  విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఎంబి.చిన్నమల్లప్పకు 2737 ఓట్లు వచ్చాయి. 1999లో అనంతపురం నుంచి ఎంపిగా గెలిచిన శ్రీనివాసులు, 2014లో అసెంబ్లీకి ఎన్నికై చీఫ్ విప్ అనంతరం మంత్రి పదవిని పొందారు. 
రాయదుర్గంలో మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి 10సార్లు విజయం సాధిస్తే, టిడిపి మూడుసార్లు, వైసిపి ఒకసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి , ఇండిపెండెంట్ అభ్యర్ధి ఒకసారి గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పాటిల్ వేణుగోపాలరెడ్డి మూడుసార్లు గెలిచారు. తిప్పేస్వామి, బండి హూలికుంటప్ప, కాపు రామచంద్రారెడ్డిలు రెండేసి సార్లు గెలుపొందారు. ఒకసారి ఉప ఎన్నికలో గెలిచిన పయ్యావుల వెంకటనారాయణ, ఉరవకొండ నుంచి మూడుసార్లు గెలిచిన కేశవ్ లు తండ్రి,కొడుకులు.

Activities are not Found
No results found.