ఆంధ్రప్రదేశ్ - CLICK HERE

వేమూరు నియోజకవర్గం 2004 వరకు జనరల్ స్థానంగా ఉండగా, 2009లో అది రిజర్వుడ్ కేటగిరిలోకి వెళ్లింది. 2014 సాధారణ ఎన్నికలలో ఇక్కడ పోటీ చేసిన టిడిపి అభ్యర్ధి నక్కా ఆనందబాబు తన సమీప ప్రత్యర్ధి ఎం.నాగార్జునపై 2127 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆనందబాబు వరుసగా రెండోసారి గెలుపొందారు.
వేమూరుకు 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి ఆరుసార్లు, స్వతంత్ర పార్టీ రెండుసార్లు గెలిచాయి. ఇక్కడ గెలిచిన ఐదుగురు నేతలు మంత్రులయ్యారు. కల్లూరి చంద్రమౌళి, యడ్లపాటి వెంకటరావు, నాదెండ్ల భాస్కరరావు, ఆలపాటి ధర్మారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు మంత్రిపదవులు నిర్వహించిన ప్రముఖులు. నాదెండ్ల భాస్కరావు ఇక్కడ ఒకసారి, విజయవాడ తూర్పు, తెనాలిలలో కూడా ఒక్కొక్కసారి చొప్పున గెలిచారు.
1983లో ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఉన్న నాదెండ్ల తిరుగుబాటు చేసి నెలరోజులపాటు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. ఖమ్మం నుంచి లోక్ సభకు కూడా ఒకసారి ఎన్నికయ్యారు. యడ్లపాటి వెంకటరావు ఇక్కడ మూడుసార్లు గెలిచారు. ఆయన ఒకసారి రాజ్యసభ్యకు ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ గాకూడా బాధ్యతలు నిర్వహించారు. ఆలపాటి ధర్మారావు ఇక్కడ ఒకసారి, దుగ్గిరాలలో మరోసారి గెలిచారు. కల్లూరి చంద్రమౌళి , ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు కూడా రెండేసి సార్లు గెలిచారు. రాజేంద్రప్రసాద్ 2014లో తెనాలిలో మూడోసారి గెలుపొందారు.