ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

ఉంగుటూరు
ఉంగుటూరు

2014 సాధారణ ఎన్నికలలో ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి నేత జి.వీరాంజనేయులు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్ధి పి శ్రీనివాసరావుపై 8930 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2009లో గెలిచి మంత్రి పదవి నిర్వహించిన వట్టి వసంతకుమార్ 2014 ఎన్నికలలో పోటీ చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన కె.అప్పారావు 2161 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. 
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వట్టి వసంతకుమార్ రెండుసార్లు గెలిచి వైఎస్ క్యాబినెట్ లో స్థానం పొందారు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్ మంత్రివర్గాలలో ఉన్నారు. 2009లో ఉంగుటూరు నుంచి పోటీ చేసిన ప్రజారాజ్యం సీనియర్ నేత , మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మూడోస్థానానికి పరిమితవ్వడం విశేషం. కోటగిరి చింతలపూడిలో ఐదుసార్లు గెలిచారు. ఆ నియోజకవర్గం రిజర్వుడ్ కేటగిరిలోకి వెళ్లడంతో ఉంగుటూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 
ఉంగుటూరుకు 11సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు గెలిచాయి. జిల్లాలో అత్యధికంగా ఆరుసార్లు గెలిచిన నేతగా రికార్డు పొందిన వరప్రసాదమూర్తిరాజు ఇక్కడ రెండుసార్లు, తాడేపల్లిగూడెం, పెంటపాడులలో మరో నాలుగుసార్లు విజయం సాధించారు.  కంటమని శ్రీనివాసరావు, కొండ్రెడ్డి విశ్వనాథంలు రెండేసి సార్లు గెలిచారు. 1952లో అలంపురం నుంచి గెలిచిన పసల సూర్యచంద్రరావు, రెండుసార్లు గెలిచిన వసంతకుమార్ లు సమీప బంధువులు. మూర్తిరాజు గతంలో పివి. క్యాబినెట్ లో పని చేశారు.  

Activities are not Found
No results found.