ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

తుని
తుని

2014 సాధారణ ఎన్నికలలో తుని నియోజకవర్గం నుంచి వైసిపి విజయకేతనం ఎగురవేసింది. వైసిపి అభ్యర్ధి దాడిశెట్టి రాజా, తన సమీప టిడిపి అభ్యర్ధి యనమల కృష్ణుడుపై 18573 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాజా మెదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డాక్టర్ సి.పాండురంగారావు కు కేవలం 1763 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరుసార్లు ఏకధాటిగా గెలుస్తూ, ఓటమి ఎరుగని నేతగా ఉన్న మాజీ స్పీకర్ , పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తొలిసారిగా 2009లో ఓటమి పాలయ్యారు. తదుపరి ఆయన శాసనమండలి సభ్యుడై విపక్ష నేతగా ఉన్నారు. 2014లో టిడిపికి అధికారం రావడంతో మంత్రి అయ్యారు. తునిలో రాజా వివికే బహదూర్ కాంగ్రెస్ తరపున నాలుగుసార్లు గెలిస్తే, ఆయన కుమార్తె ఎన్.విజయలక్ష్మి రెండుసార్లు గెలిచారు. మరో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2009లో యనమలపై గెలిచిన అశోక్ బాబు వీరికి సమీప బంధువు. చంద్రబాబు క్యాబినెట్లో ఎన్న యనమల అంతకుముందు ఎన్టీఆర్ క్యాబినెట్ లో కూడా పని చేశారు. 1994లో శాసనసభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. 1999లో ఎన్నిక్యాయక చంద్రబాబు క్యాబినెట్ లో సభ్యడుయ్యారు. జిల్లా రాజకీయాలలో సుదీర్ఘకాలం క్యాబినెట్ హోదా కలిగిన నేతగా గుర్తింపు పొందారు.  
గంటి మోహనచంద్ర బాలయోగి 1998లో లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు ఈయన రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా ఉండటం ఓ అరుదైన ఘట్టం. ఇక్కడ నుంచి రెండుసార్లు గెలిచిన ఎన్.ఎం. విజయలక్ష్మి కూడా కొంతకాలం అంజయ్య క్యాబినెట్ లో సభ్యురాలిగా ఉన్నారు. 

Activities are not Found
No results found.