ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

రాప్తాడు
రాప్తాడు

2014 సాధారణ ఎన్నికలలో రాప్తాడు శాసనసభ నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీత మరోసారి విజయం సాధించారు. ఆమె తన సమీప వైసిపి అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై 7774 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం సునీత చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె పెనుకొండ నుంచి గెలవగా, రెండుసార్లు రాప్తాడు లో గెలుపొందారు. కొన్నేళ్ల క్రితం హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి భార్య అయిన సునీత, రవీంద్ర మరణం తర్వాత రాజకీయాలలోకి వచ్చారు. పెనుకొండ ఉప ఎన్నికలో గెలిచిన పరిటాల సునీత, 2009,2014లో రాప్తాడు నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. 
పరిటాల రవి పెనుకొండ నుంచి నాలుగుసార్లు గెలుపొంది, ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. 

Activities are not Found
No results found.