ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

బద్వెల్
బద్వెల్

2014 సాధారణ ఎన్నికలలో బద్వేలు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి టి.జయరాములు గెలుపొందారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి  ఎన్డీ విజయజ్యోతిపై 10079 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రభాష్ కు 1524 ఓట్లు మాత్రమే వచ్చాయి. సిపిఐ తరపున పోటీ చేసిన ఎస్వీ సుబ్బయ్యకు 2185 ఓట్లు వచ్చాయి. 2009లో గెలిచిన పి.ఎం.కమలమ్మ కేంద్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆమె పోటీలో లేరు. 
బద్వేలుకు 16సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి నాలుగుసార్లు, వైసిపి, పిఎస్పీ, స్వతంత్ర, జనతాపార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. బద్వేలు నుంచి బిజివేముల వీరారెడ్డి అత్యధికంగా ఏడుసార్లు విజయం సాధించి జిల్లాలోనే రికార్డు సాధించారు.  ఆయన గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లలో పని చేశారు. వీరారెడ్డి మరణం తర్వాత ఆయన కుమార్తె విజయమ్మ గెలిచారు. వీరారెడ్డి ఎనిమిదిసార్లు పోటీ చేస్తే.. ఏడుసార్లు పోటీ చేసిన చరిత్ర డాక్టర్ వడ్లమాని శివరామకృష్ణారావుకి దక్కింది. ఈయన రెండుసార్లు గెలిచారు. ఆయన తండ్రి వి.చిదానందం కూడా రెండుసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన బండారు రత్నసభాపతి, రాజంపేటలో మరో మూడుసార్లు గెలుపొందారు. 

Activities are not Found
No results found.