ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

గన్నవరం
గన్నవరం

2014 సాధారణ ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుంచి టిడిపి గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావుకు బదులుగా విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ కు టిక్కెట్ ఇచ్చారు. వంశీ తన సమీప వైసిపి ప్రత్యర్ధి డాక్టర్ దుట్టా రామచంద్రరావుపై 9548 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. గతంలో ఒకసారి విజయవాడ లోక్  సభ కు పోటీ చేసి ఓడిపోయిన వంశీ ఈసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుంకర పద్మశ్రీకి కేవలం 2506 ఓట్లు మాత్రమే వచ్చాయి.  
గన్నవరం నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి నాలుగుసార్లు, టిడిపి ఐదుసార్లు, అవిభక్త సిపిఐ రెండుసార్లు, సిపిఎం ఒకసారి గెలిచాయి. రెండుసార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ప్రఖ్యాత కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య గన్నవరం నియోజకవర్గంలో మూడుసార్లు గెలుపొందడం ఒక ప్రత్యేకత. 1967లో గెలిచిన వెలివెల సీతారామయ్య ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రముఖ నేత కాకాని వెంకటరత్నం గెలుపొందారు. కాకాని ఉయ్యూరులో మరో మూడుసార్లు గెలిచారు. ముసునూరు రత్నబోస్ ఒకసారి టిడిపి తరపున, మరోసారి కాంగ్రెస్ ఐ తరపున గెలిచారు. 
1994లో ఇక్కడ ఇండిపెండెంటుగా నెగ్గిన గద్దె రామ్మోహన్, 1999లో విజయవాడ లోక్ సభ కు ఎన్నికయ్యారు. 2014 విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈయన భార్య అనూరాధ జడ్పీఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ప్రముఖ నేత కాకాని వెంకటరత్నం గతంలో కాసు, పివి క్యాబినెట్లలో సభ్యునిగా ఉన్నారు. 

Activities are not Found
No results found.