ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

పెదకూరపాడు
పెదకూరపాడు

2014 సాధారణ ఎన్నికలలో పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మరోసారి విజయం సాధించారు. శ్రీధర్ తన సమీప వైసిపి ప్రత్యర్ధి బి.బ్రహ్మానాయుడుపై 9196 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సూరిబాబుకు కేవలం 4805 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన పెదకూరపాడు 1985 తర్వాత 2009లో తిరిగి తెలుగుదేశం పార్టీ వశమైంది. తదుపరి 2014లో కూడా శ్రీధర్ గెలుపొందారు. కన్నా 2009లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఐదోసారి గెలిచారు. కానీ 2014లో ఓటమి చవిచూశారు. 
పెదకూరపాడుకు 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి నాలుగుసార్లు, కెఎల్పీ, జనతా పార్టీలు ఒక్కొక్కసారి గెలిచాయి. గణపా రామస్వామి రెడ్డి నాలుగుసార్లు, కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ నాలుగుసార్లు, గుంటూరు పశ్చిమలో ఒకసారి గెలుపొందారు. కన్నా లక్ష్మీ నారాయణ 1991లో నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్ లోను, 2004 నుంచి 2014 వరకు వైఎస్ , రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లలో ఉన్నారు. 

Activities are not Found
No results found.