ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

కందుకూరు
కందుకూరు

2014 సాధారణ ఎన్నికలలో కందుకూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి పోతుల రామారావు గెలుపొందారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి దివి శివరామ్ పై 3806 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. పోతుల రామారావు అంతకుముందు 2004లో కొండపిలో కాంగ్రెస్ తరపున గెలిచారు. కొండపి రిజర్వుడ్ కావడంతో 2009లో పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైసిపిలో చేరి కందుకూరులో పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఆర్.వెంకటరావుకు 641 ఓట్లు వచ్చాయి. మాజీ మంత్రి మహీధర్ రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి విముఖత చూపారు. 2009లో మహీధర్ రెడ్డి మూడోసారి ఎన్నికయ్యాక , కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ఆయనకు అవకాశం వచ్చింది. మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణరెడ్డి కూడా కందుకూరులో మూడుసార్లు గెలుపొందారు. ఇక దివి శివరామ్ కందకూరులో రెండుసార్లు గెలిస్తే, ఆయన తండ్రి కొండయ్య చౌదరి రెండుసార్లు గెలిచారు. రాష్ట్రమంత్రిగా, స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. మరో ప్రముఖుడు నలమోతు చెంచురామానాయుడు ఇక్కడ మూడుసార్లు, కొండెపిలో ఒకసారి మొత్తం నాలుగుసార్లు ఎన్నికయ్యారు. చెంచురామానాయుడు గతంలో కాసు, పివిల మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. 

Activities are not Found
No results found.