ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

ఎర్రగొండపాలెం
ఎర్రగొండపాలెం

2014 సాధారణ ఎన్నికలలో ఎర్రగొండపాలెం రిజర్వుడ్ శాసనసభ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి డేవిడ్ రాజు గెలిచారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి అజిత్ రావుపై 19071 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. డేవిడ్ రాజు గతంలో టిడిపి తరపున సంతనూతలపాడు నుంచి గెలుపొందారు. జెడ్పీ ఛైర్మన్ గా కూడా పని చేశారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.కనకారావుకు కేవలం 1332 ఓట్లు మాత్రమే దక్కాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ తరపున గెలిచిన ఎ.సురేష్ 2014 ఎన్నికల సమయంలో వైసిపిలోకి వచ్చి సంతనూతలపాడు నుంచి రెండోసారి ఎన్నికవడం విశేషం. 
గతంలో 1955 నుంచి 1972 వరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఉండేది. ఒక ఉప ఎన్నికతో సహా అప్పుడు ఐదు ఎన్నికలు జరిగాయి. తిరిగి మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడి ఆరో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ నాలుగుసార్లు గెలిస్తే.. ఒకసారి వైసిపి , రెండుసార్లు సిపిఐ నెగ్గింది. ప్రముఖ నేత కందుల ఓబులరెడ్డి ఇక్కడ నుంచి ఒకసారి, కంభం నుంచి ఒకసారి , మార్కాపురం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. సిపిఐ నాయకుడు పూల సుబ్బయ్య ఎర్రగొండపాలెంలో రెండుసార్లు, మార్కాపురంలో మరోసారి నెగ్గారు. ఎర్రగొండపాలెంలో ఒకసారి గెలిచిన జంకె రామిరెడ్డి, మార్కాపురంలో రెండుసార్లు గెలిచిన జంకె వెంకటరెడ్డి తండ్రి, కొడుకులు

Activities are not Found
No results found.