ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

అనపర్తి
అనపర్తి

2014 ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గం నుంచి టిడిపి విజయం సాధించింది. టిడిపి తరపున పోటీ చేసిన ఎన్.రామకృష్ణారెడ్డిని 1373 ఓట్ల మెజార్టీతో ఓడించారు. టిడిపి తరపున పోటీ చేసిన ఎస్  సూర్యనారాయణరెడ్డిని ఓడిపోయారు.2009లో కాంగ్రెస్ కు 35800 ఓట్ల ఆధిక్యత వస్తే.. 2014లో పోటీలో లేరు. ఆయనకొంతకాలం వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో ఉన్నా, తిరిగి కాంగ్రెస్ లో చేసి పోటీ చేసిన ఎ.ముక్తిశ్వరరావు కు 2780 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్.శేషారెడ్డి 2014 ఎన్నికలో పోటీలో లేరు. ఆయన కొంతకాలం వైసిపిలో ఉన్నా.. తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చి ఎన్నికల సమయంలో పోటీకి దూరమైయ్యారు. 2009లో అనపర్తిలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యాడు. 2014 ఎన్నికలో ఆయన కుమారుడు విజయం సాధించడం విశేషం. 
అనపర్తికి 14సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు గెలిచాయి. టిడిపి ఐదుసార్లు, జనతా, సిపిఐ,ప్రజాపార్టీలు ఒక్కొక్కసారి గెలుపొందాయి. నల్లమిల్లి మూలారెడ్డి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్ధి వి.రామకృష్ణ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన రెండుసార్లు గెలుపొందారు. కాంగ్రెస్ తరపున తేతలి రామారెడ్డి రెండుసార్లు నెగ్గారు.

Activities are not Found
No results found.