ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

రాజంపేట
రాజంపేట

2014 సాధారణ ఎన్నికలలో రాజంపేట శాసనసభ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి మేడా మల్లిఖార్జునరెడ్డి విజయం సాధించారు. వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డిని 11617 ఓట్ల మెజార్టీతో ఓడించారు మల్లిఖార్జున రెడ్డి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గాజుల భాస్కర్  కు 2362 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2012 ఉప ఎన్నికలో 38వేలకు పైగా మెజార్టీతో అమరనాథ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి మేడా మల్లిఖార్జున రెడ్డిపై విజయం సాధించారు. అయితే ఆశ్చర్యం కలిగించే రీతిలో మేడా కాంగ్రెస్ పార్టీని వీడి, టిడిపిలో చేరి 2014 సాధారణ ఎన్నికలలో ఆకేపాటిని ఓడించారు. అనంతరం మేడా మల్లిఖార్జున రెడ్డి ప్రభుత్వ విప్ పదవి పొందారు. 
రాజంపేటలో మహిళా నేత కె.ప్రభావతమ్మ నాలుగుసార్లు గెలిచారు. ఆమె భర్త కె.మారారెడ్డి ఒకసారి గెలిచారు. బండారు రత్నసభాపతి ఇక్కడ మూడుసార్లు, బద్వేలులో ఒకసారి గెలుపొందారు. ఈయన ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. టిడిపి తరపున పసుపులేటి బ్రహ్మయ్య రెండుసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలచిన పి.పార్థసారథి, నాలుగుసార్లు రాజంపేట నుంచి లోక్ సభకు ఎన్నికై  కొంతకాలం కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.  అమరనాథరెడ్డి ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసిపి తరపున రెండుసార్లు గెలిచారు. 

Activities are not Found
No results found.