ఆంధ్రప్రదేశ్ - CLICK HERE

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంతో మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గంలో టిడిపి మరోసారి ఘనవిజయం సాధించింది. రాష్ట్ర విభజనకు ముందు ఎన్నికలు జరగడంతో ఈ నియోజకవర్గం సంఖ్య 120తోనే మొదలైంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పార్టీని స్థాపించిన నేపధ్యంలో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే సాయిరాజ్ వైసిపిలోకి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన అనంతరం వేటుకు గురయ్యారు. అప్పట్లో టిడిపి తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. సాయిరాజ్ సాధారణ ఎన్నికలలో వైసిపి తరపున కూడా పోటీ చేయలేదు. 2014 సాధారణ ఎన్నికలలో టిడిపి తరపున బెందాళం అశోక్ పోటీ చేయగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్తు రామారావు పోటీ చేశారు. అశోక్ కు 25238 ఓట్ల ఆధిక్యత లభించింది. 2009లో రామారావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నరేష్ అగర్వాల్ కు కేవలం 6852 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు.
ఇచ్ఛాపురంలో ఒక్క 2004లో తప్ప 1983 నుంచి అన్నిసార్లు తెలుగుదేశం పార్టీనే ప్రజలు ఆదరించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కేవలం మూడుసార్లు మాత్రమే గెలిచింది. టిడిపి అత్యధికంగా ఏడుసార్లు గెలుపొందింది. కెఎల్పీ రెండుసార్లు, జనతా ఒకసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలించింది.
అప్పట్లో టిడిపి నాయకుడిగా పేరున్న ఎం.వి.కృష్ణారావు ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో వర్గ రాజకీయాల కారణంగా ఆయన పార్టీకి దూరమైయ్యారు. 1989లో కృష్ణారావు గెలిచినా.. అనర్హతకు గురి అయ్యారు. దీనికారణంగా 1994లో పోటీ చేయలేకపోయారు.