ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

తిరువూరు
తిరువూరు

2014 సాధారణ ఎన్నికలలో తిరువూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి కొక్కిలిగడ్డ రక్షణ నిది గెలుపొందారు. తన సమీప టిడిపి ప్రత్యర్ధి నల్లగట్ల స్వామిదాస్ పై 1676 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. శాసనసభకు రక్షణ నిధి  తొలిసారి గెలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాజీవ్ రతన్ కు 3379 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. స్వామిదాస్ గతంలో రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 
1962 వరకు తిరువూరు నియోజకవర్గం జనరల్ గా ఉండేది.  ఆ తర్వాత రిజర్వుడ్ గా మారింది. మొత్తం 15సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఐదుసార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. 
1952లో తండ్రి,కొడుకులు పరస్పరం పోటీపడగా, కొడుకు పేట రామారావు విజయం సాధించారు. తిరిగి 1955లో తండ్రి పేట బాపయ్య కుమారుడ్ని ఓడించారు. కుమారుడు సిపిఐ తరపున, తండ్రి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. తిరువూరులో రెండుసార్లు గెలిచిన కోనేరు రంగారావు, కంకిపాడులో ఒకసారి గెలిచారు. గెలిచిన మూడుసార్లు ఈయన ఆయా మంత్రివర్గాలలో పదవి పొందడం కోనేరు ప్రత్యేకత. కోట్ల కేబినెట్ లో డిప్యూటీ సిఎం పదవిని కూడా నిర్వహించారు.  స్వామిదాస్, కోట రామయ్య, పేట బాపయ్య రెండేసిసార్లు గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన వేముల కూర్మయ్య, గుడివాడలో మరోసారి విజయం సాధించారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram