ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

శృంగవరపు కోట
శృంగవరపు కోట

2004 వరకు గిరిజనులకు రిజర్వుడుగా ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గం 2009లో జనరల్ గా మారింది. 2014 సాధారణ ఎన్నికలోను సిట్టింగ్ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్ధి  కె.లలితకుమారి విజయం సాధించారు. ఆమె తన సమీప వైసిపి ప్రత్యర్ధి  ఆర్.జగన్నాథాన్ని 28572 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఇందుకూరు రఘురాజు కూడా 30636 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ దక్కించుకున్నారు. 
ఎస్.కోటగా పేరొందిన ఈ నియోజకవర్గానికి 16సార్లు ఎన్నికలు జరిగితే టిడిపి ఏడుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఐదుసార్లు, ప్రజాసోషలిస్టు, సోషలిస్టు పార్టీలు మూడుసార్లు, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. 
1953లో ఏర్పడిన ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ నుంచే 1953లో ఉప ఎన్నిక ద్వారా ఏకగ్రీవంగా చట్టసభలోకి ప్రవేశించారు. 
ఈయన కోసం 1952లో ఎన్నికైన సోమయాజులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక్కడ నుంచి ఎల్.బి.దుక్కు నాలుగుసార్లు గెలిచారు. సీనియర్ నేత కోళ్ళ అప్పలనాయుడు గతంలో జనరల్ ఉన్నప్పుడు ఒకసారి గెలిచారు. ఆయన మొత్తం ఏడుసార్లు గెలిచారు. ఇక్కడ కాకుండా రేవిడిలో ఒకసారి, ఉత్తరాపల్లిలో ఐదుసార్లు నెగ్గారు. 2009, 14లలో గెలిచిన లలితకుమారి ఈయనకు కోడలు. మరో నేత కెవిపిఎస్.పద్మనాభరాజు ఎస్ కోట నుంచి ఒకసారి, అలమండ నుంచి రెండుసార్లు, రేవిడి, ఉత్తరాపల్లి నుంచి ఒక్కొక్కసారి గెలుపొందారు. పద్మనాభరాజు, కోళ్ళ అప్పలనాయుడులు మంత్రి పదవులు నిర్వహించారు. 

Activities are not Found
No results found.