ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

ఎచ్చెర్ల
ఎచ్చెర్ల

2014 సాధారణ ఎన్నికలో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు గెలుపొందారు. 2009లో ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్లి పోటీ చేసి ఓడిపోయినా , తిరిగి టిడిపిలోకి వచ్చి విజయం సాధించడం విశేషం. దాంతో కళా వెంకట్రావు ఐదోసారి గెలిచినట్లుయింది. కళా వెంకటరావు తన సమీప వైసిసి ప్రత్యర్ధి జి.కిరణ్ కుమార్ ను 4741 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కిలారి రవికిరణ్ కు కేవలం 2148 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. 
కళా వెంకటరావు గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడుగా కూడా పని చేశారు. ఉనుకూరు నియోజకవర్గం రద్దు అవడంతో ఆయన ఎచ్చెర్లకు మారారు. ఈయన తమ్ముడు గణపతిరావు ఒకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తమ్ముడి భార్య కిమిడి మృళాణిని ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేసి పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఓడించారు. తదుపరి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి లభించింది. 
1967లో ఏర్పడిన ఎచ్చెర్ల నియోజకవర్గానికి 11సార్లు ఎన్నికలు జరిగితే , కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి మూడుసార్లు గెలిచాయి. టిడిపి ఆరుసార్లు, ఒకసారి ఇండిపెండెంట్ , ఒకసారి జనతా పార్టీ అభ్యర్ధి గెలుపొందారు. 
ఈ నియోజకవర్గం రిజర్వుడ్ గా ఉన్నప్పుడు టిడిపి సీనియర్ నేత , మాజీ స్పీకర్ ప్రతిభా భారతి  ఐదుసార్లు ఎన్నికయ్యారు. 1978 నుంచి రిజర్వుడుగా ఉన్న ఎచ్చెర్ల 2009 నాటికి జనరల్ అయ్యింది.  ప్రతిభా భారతి తండ్రి కొత్తపల్లి పున్నయ్య పొందూరు నుంచి ఒకసారి ఏకగ్రీవంగా, చీపురుపల్లి నుంచి రెండుసార్లు గెలుపొందారు. పున్నయ్య సోదరుడు నరసయ్య కూడా మూడుసార్లు పొందూరు , పాలకొండ, ఎచ్చెర్లలలో ఎన్నికయ్యారు. 2004 ఎచ్చెర్లలో ఓడిపోయిన ప్రతిభా భారతి,  2009, 2014లలో రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఎచ్చెర్లలో ఒకసారి, రాజాంలో మరోసారి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ విజయం సాధించారు.  కానీ 2014లో రాజాంలో మళ్లీ పోటీ చేసిన మురళీమోహన్ ఓడిపోయారు. ఎచ్చెర్లలో ఒకసారి గెలిచిన హరియప్పుడు రెడ్డి అంతకుముందు షేర్ మహ్మద్ పురం నుంచి గెలుపొందారు. చౌదరి సత్యనారాయణ షేర్ మహ్మద్ పురం , పొందూరులలో రెండుసార్లు గెలిచారు. పొందూరులో ఒకసారి గెలిచిన లుకలాపు లక్ష్మణదాసు మొత్తం నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఈయన మంత్రిగా కూడా పని చేశారు. 

Activities are not Found
No results found.