తెలంగాణ - CLICK HERE

సిర్పూర్
సిర్పూర్

సిర్పూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,87,387. అందులో పురుషులు - 94786, మహిళలు 92570, థర్డ్ జెండర్ 31 మంది ఉన్నారు.

2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి హరీశ్ బాబుపై 24,144 ఓట్ల మెజార్టీతో కోనేరు కోనప్ప  గెలుపొందారు. కోనప్పకు 82,957 ఓట్లు రాగా,  కాంగ్రెస్ అభ్యర్ధి  హరీశ్ 58, 813, మూడో స్థానంలో నిల్చిన బిజెపి అభ్యర్ధిగా డా. కే. శ్రీనివాస్ కు 6258 ఓట్లు నమోదయ్యాయి. 

2018 ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప టిఆర్ఎస్ టిక్కెట్ పై బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి హరీశ్ బాబు పోటీ చేస్తున్నారు.  ఇక బిజెపి తమ అభ్యర్ధిగా డా. కే. శ్రీనివాస్ను రంగంలోకి దింపింది.  బిఎస్పీ తరపున రావి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. 

2014 ఎన్నికలో బీఎస్పీ టికెట్ పై గెలిచిన కోనప్ప ఆ తర్వాత టిఆర్ ఎస్ లో చేరిపోయారు.  తెలంగాణ ఆవిర్భావంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం బలంగా వీచింది. ఆదిలాబాద్ జిల్లాలోని తొలి నియోజకవర్గమైన సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది.  టీఆర్ఎస్ ఓడిపోవడం సంచలనం సృష్టిస్తోంది. అయితే బీఎస్పీ గుర్తుపై కోనేరు కోనప్ప 8,837 ఓట్ల ఆధిక్యతో విజయం సాధించారు. సిర్పూర్ లో కోనప్పకు 49,033 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కావేటి సమ్మయ్యకు 40,196 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్  అభ్యర్థి ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు 26596 ఓట్లు, టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్ధి రావి శ్రీనివాసరావుకు 19359 ఓట్లు వచ్చాయి. తరువాత కోనేరు కోనప్ప టీఆర్ ఎస్‌ లో చేరారు. కోనప్ప 2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. 2009లో ఓడిపోయారు. తర్వాత పరిణామాలలో ఆయన తొలుత వైసీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి చేరారు. టిక్కెట్ రాని నేపథ్యంలో బీఎస్పీ టిక్కెట్ పై పోటీ చేసి గెలవటం మరో సంచలనం. 

ఆదిలాబాద్ కు చెందిన మరో నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డికి సన్నిహితుగా ఉన్న కోనప్ప... జిల్లాలోని మొదటి నియోజకవర్గమైన సిర్పూరులో రెండోసారి గెలిచారు. 1952 నుంచి సిర్పూరు నియోజకవర్గం ఉంది. తొలిరోజుల్లో ఈ ప్రాంతంలో సోషలిస్టు ప్రభావం అధికంగా ఉండేది. 1952, 1957లలో సోషలిస్టు అభ్యర్ధులు గెలుపొందారు. 1957లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గం ఉండేది. అంటే అప్పట్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒక జనరల్, ఒక రిజర్వుడు కేటగిరి అభ్యర్ధిని ఎన్నుకోవాలన్నమాట.  ఈ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్ధులు ఎస్సీ అభ్యర్ధులే గెలుపొందారు. ప్రజా సోషలిస్టు పార్టీ తరపున కోదాటి రాజమల్లు, కాంగ్రెస్ తరపున జి.వెంకటస్వామి గెలిచారు. ప్రముఖ కార్మిక నేత జి.సంజీవరెడ్డి రెండుసార్లు, ప్రముఖ స్వాతంత్రయోధుడు కేవి.కేశవులు రెండుసార్లు గెలుపొందారు. పురుషోత్తమరావు భార్య పి. రాజ్యలక్ష్మి ఒకసారి గెల్చారు. 1957 నుంచి 1978 వరకు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉండగా.. తొలిసారి 1983లోటిడిపి అక్కడ గెల్చింది. అప్పటి నుంచి 2004లో కోనప్ప కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచే వరకు అక్కడ కాంగ్రెస్ కు అవకాశం రాలేదు.  మళ్లీ 2009లో టిఆర్ఎస్ గెలవడం విశేషం. 

కాంగ్రెస్ ఆరుసార్లు, సొషలిస్టు . ప్రజాసోషలిస్టు ఒకసారి, టీడీపీ, టీఆర్ఎస్ రెండుస్లారు గెల్చాయి. ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచారు. కోదాటి రాజమల్లు ఇక్కడ ఒకసారి, లక్సెట్టిపేటలో సోషలిస్టుగా ఒకసారి, చిన్నూరు నుంచి కాంగ్రెస్ తరపున మూడుసార్లు మొత్తం ఐదుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. ఒక్కసారి అసెంబ్లీకి ఎన్నికైన వెంకటస్వామి ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. రాజమల్లు, కే.వి.కేశవులు గతంలో జలగం వెంగళరావు క్యాబినెట్ లో మంత్రి పదవులు నిర్వహించారు. 

 

 

గత ఎన్నికలో బీఎస్పీ టికెట్ పై గెలిచిన టీఆర్ఎస్ లో చేరిన కోనప్ప... ఈసారి టీఆర్ఎస్ టికెట్ పై బరిలోకి దిగుతున్నారు.

Activities are not Found

సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ ను గెలిపిస్తాయి - కోనేరు కోనప్ప ధీమా

సిర్పూర్ లో కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి హరీష్ బాబు ఎన్నికల ప్రచారం