తెలంగాణ - CLICK HERE

మహేశ్వరం
మహేశ్వరం

మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,12,460 అందులో పురుషులు -2,13,528  మహిళలు - 1,98,882, థర్డ్ జెండర్  50 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టిఆర్ఎస్ తరపున పోటికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిజెపి నుండి అందెల శ్రీరాములు యాదవ్, బిఎల్ఎఫ్ తరపున కె. అరుణకుమార్ (బిఎల్పీ)  పోటీ చేస్తున్నారు. 

2014 సాధారణ ఎన్నికలో హైదరాబాద్ మాజీ మేయర్, టిడిపి సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న ఎం.రంగారెడ్డిపై 30784 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆనాటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి గెలుపొందగా, ఈసారి ఆమె పోటీలో లేరు. ఆమె కుమారుడు చేవెళ్ల లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు. 
కాంగ్రెస్ , సిపిఐల మధ్య పొత్తు కుదిరినా, కాంగ్రెస్ అభ్యర్ధి ఎం.రంగారెడ్డి కాంగ్రెస్ బిఫారంపై పోటీ చేశారు. సిపిఐ తరపున మాజీ ఎంపి అజీజ్ పాషా పోటీ చేసి ఓడిపోయారు.  పాషాకు కేవలం 5333 ఓట్లు మాత్రమే వచ్చాయి. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన కె.మనోహర్ రెడ్డికి 42517 ఓట్లు దక్కాయి. అయితే తీగల కృష్ణారెడ్డి తర్వాత కాలంలో టిఆర్ఎస్ లో చేరిపోయారు. 
చేవెళ్ల చెల్లెమ్మగా ప్రసిద్ధికెక్కిన సబితా ఇంద్రారెడ్డి అంతకు ముందు చేవెళ్ల నుంచి రెండుసార్లు, 2009లో చేవెళ్ల రిజర్వుడ్ నియోజకవర్గంగా మారడంతో సబిత మహేశ్వరం నుంచి పోటీ చేశారు. 2004 నుంచి వైఎస్ క్యాబినెట్ లో గనుల శాఖమంత్రిగా ఉన్న సబిత ఈసారి హోంశాఖ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర చరిత్రలో ఈ శాఖను నిర్వహించిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. రోశయ్య, కిరణ్ మంత్రివర్గంలోను ఉన్నారు. ఈమె భర్త ఇంద్రారెడ్డి చేవెళ్ల నుంచి మూడుసార్లు టిడిపి, ఒకసారి కాంగ్రెస్ పక్షాన గెల్చారు. ఆయన గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో వివిధ శాఖలు నిర్వహించారు. 1994లో ఇంద్రారెడ్డి కూడా హోంశాఖకు మంత్రిగా ఉన్నారు. ఈరకంగా దంపతులిద్దరు ఒకే శాఖకు మంత్రులు అవడం కూడా అరుదైన విషయం. 1995లో టిడిపి చీలినప్పుడు ఎన్టీఆర్ పక్షాన నిలిచిన ఇంద్రారెడ్డి కొంతకాలం ఎన్టీఆర్ టిడిపిలో కొనసాగి అనంతరం కాంగ్రెస్ లో చేరారు. అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ లోనే కొనసాగి మూడుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. 
ఈ నియోజకవర్గానికి మొత్తం రెండుసార్లు ఎన్నికలు జరగ్గా
2009లో కాంగ్రెస్, 2014 టిడిపి సీటును కైవసం చేసుకున్నాయి. 

  

వచ్చే తరాల కోసం టీఆర్ఎస్ ఆలోచిస్తుంది...

వచ్చే ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం టీఆర్ఎస్ ఆలోచన చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మహేశ్వరంలో ఇంటింటికి బిజెపి

మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ ప్రచారకార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తీగల ఓటమే టార్గెట్... ఇండిపెండెంట్‌గా పోటీ...

105 మందితో తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ దూకుడు పెంచితే... పార్టీ టికెట్లను ఆశించినవారు... రెబల్స్‌గా మారుతున్నారు...పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మచ్చలేని మనిషి తీగల - ఆపధర్మ మంత్రి కేటిఆర్

మహేశ్వరం బిజెపి అభ్యర్ధి శ్రీరాములు యాదవ్ ఎన్నికల ప్రచారం