తెలంగాణ - CLICK HERE
- నియోజకవర్గాలు
- కరీంనగర్
- చొప్పదండి
- వేములవాడ
- సిరిసిల్ల
- మానకొండూరు
- హుజురాబాద్
- హుస్నాబాద్

కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,77,236. అందులో పురుషులు - 1,39,065, మహిళలు - 1,38,135, థర్డ్ జెండర్ - 36మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపింది టీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు. ఇక బిజెపి నుంచి బండి సంజయ్, శివసేన నుండి వేణు ప్రసాద్, బిఎల్ఎఫ్ తరపున వసీమోద్దీన్(బిఎల్పీ) ఎన్నికల బరిలోకి దిగారు.
ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన జిల్లా కరీంనగర్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో టీఆర్ఎస్ బలమైన పునాదులు ఏర్పరచుకున్న జిల్లా ఇది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ తరపున గెలిచిన గంగుల కమలాకర్ 2014లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థి బండి సంజయ్ పై 24754 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సి.లక్ష్మీనరసింహారావుకు 51339 ఓట్లు వచ్చాయి.
1952 నుంచి 14 సార్లు కరీంనగర్ స్థానానికి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలిచాయి. టీడీపీ ఐదుసార్లు గెలిచింది. పీడీఎఫ్ , సోషలిస్టులు, టీఆర్ఎస్ ఒక్కోసారి, ఇండిపెండెంట్లు మరోసారి గెలిచారు. 1983 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒకే ఒక్కసారి 2004లో మాత్రమే గెలిచింది. సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు గెలిచారు. 1989లో ఇక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన వి.జగపతిరావు 1972లో జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. దివంగత నేత జువ్వాది చొక్కారావు మూడుసార్లు ఇక్కడ నుంచి అసెంబ్లీకి, మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎం.సత్యనారాయణరావు కూడా మూడుసార్లు లోక్ సభకు గెలుపొందారు.
ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను రంగంలోకి దింపింది టీఆర్ఎస్.