తెలంగాణ - CLICK HERE

ఖమ్మం
ఖమ్మం

ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,58,440. అందులో పురుషులు -  1,25,186,  మహిళలు - 1,33,217, థర్డ్ జెండర్ - 37మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ  ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ని రంగంలోకి దింపింది టిఆర్ఎస్. ప్రజాకూటమిలోని టిడిపి నుంచి నామా నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి ఉప్పల శారద , బిఎల్ఎఫ్ తరపున  పి.రామారావు  ఎన్నికల బరిలోకి దిగారు. 

2014 సాధారణ ఎన్నికలో ఖమ్మం నియోజకవర్గం సీనియర్ టిడిపి నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్ చేతిలో 5609 ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. పువ్వాడ అజయ్ ప్రముఖ కమ్యూనిస్ట్ నేత , మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరావు కుమారుడు కొంతకాలం వైసిపి లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత అజయ్ కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసిపి తరపున పోటీ చేసిన కె.నాగభూషణయ్యకు 24969 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధి ఆర్ జెసి కృష్ణకు 14003 ఓట్లు వచ్చాయి. అయితే తర్వాత జరిగిన పరిణామాల కారణంగా 2016లో టిఆర్ఎస్ లో చేరిపోయారు.. తుమ్మల గతంలో సత్తుపల్లి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. సత్తుపల్లి రిజర్వుడు కావడంతో ఖమ్మం కు మారి 2009లో విజయం సాధించారు. కానీ, 2014లో ఓడిపోయారు. టిడిపిలో వర్గ విబేధాలు కూడా అందుకు కారణమని చెబుతారు. తదుపరి తుమ్మల టిఆర్ఎస్ లో చేరిపోయారు. తుమ్మల గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లో వివిధ శాఖల మంత్రిగా పని చేశారు. 20014లో కేసిఆర్ మంత్రివర్గ సభ్యుడయ్యారు. 
కమ్యూనిస్టు కేంద్రంగా ఖమ్మంలో 10సార్లు వామపక్షాలు గెలుపొందాయి. 1952,57లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే పిడిఎఫ్, సిపిఐ కలిసి ఐదుసార్లు, సిపిఎం నాలుగుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి నాలుగుసార్లు, టిడిపి ఒకసారి గెలుపొందాయి. 2009లో ఖమ్మం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సత్తుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు , టిక్కెట్ రాక తిరుగుబాటు చేసి ఇండిపెండెంటుగా పోటీ చేశారు. 2014లో టిఆర్ఎస్ టిక్కెట్ పై కొత్తగూడెంలో పోటీ చేసి గెలుపొందారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఒకసారి శాసనసభకు, మరోసారి లోక్ సభకు గెలుపొందారు. సిపిఐ రాష్ట్రకార్యదర్శిగా గతంలో పని చేసిన నల్లమల గిరిప్రసాద్ ఖమ్మంలో ఒకసారి గెలుపొందారు. ఆయన ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.  సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు రెండుసార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 1967, 1972లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మహ్మద్ రజబ్ అలీ ఆ తర్వాత సుజాతనగర్ లో నాలుగుసార్లు గెలిచి జిల్లాలో అత్యధికసార్లు గెలుపొందిన నేతగా రికార్డు సృష్టించారు.  1957లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన 
తేళ్ల లక్ష్మీకాంతమ్మ 1978లో హైదరాబాద్ సిటీ లో మరోసారి గెలిచారు.  ఆమె ఖమ్మం నుంచి మూడుసార్లు లోక్ సభకు కూడా నెగ్గారు. టిడిపి 1983 నుంచి ఆయా సందర్భాలలో మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చినప్పటికీ స్వయంగా 2004 వరకు గెలవలేదు.  

  

ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ని రంగంలోకి దింపింది టిఆర్ఎస్ 

టీఆర్ఎస్ ఓటమే బీఎల్ఎఫ్ లక్ష్యం.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే బిఎల్ఎఫ్ లక్ష్యం అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

జిల్లాలోని 10కి 10 స్థానాలు మనవే...

తమ ప్రభుత్వం నిర్మిస్తున్న ఒక్క డబుల్ ఇల్లు... గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నిర్మించిన ఏడు ఇళ్లతో సమానం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.పూర్తి వార్త వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఖమ్మం డేంజర్‌లో ఉంది...

ఖమ్మం జిల్లాకు డేంజర్‌ రాబోతోందని హెచ్చరించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం యాగం

తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం యాగం చేశా... పవిత్రమైన దినం యాగం చేసి ఖమ్మం జిల్లాకే వచ్చానని తెలిపారు గులాబిదళపతి కె.చంద్రశేఖర్‌రావు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

రంగంలోకి కేసీఆర్‌..

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగుతున్నారు.  వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మైనార్టీ సభలో ప్రజా కూటమి అభ్యర్ధి నామా నాగేశ్వరరావు

ఖమ్మంలో జోరుగా ప్రజాకూటమి ఎన్నికల ప్రచారం

ఖమ్మం సీటు ఎవరికి ?