తెలంగాణ - CLICK HERE

2014 సాధారణ ఎన్నికలో మహబూబాబాద్ గిరిజన నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాలోతు కవితను టిఆర్ఎస్ అభ్యర్ధి శంకర్ నాయక్ ఓడించారు. కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉండి కవిత ఓడిపోతే, ఈమె తండ్రి రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందడం విశేషం. శంకర్ నాయక్ 9315 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టిడిపి-బిజెపి కూటమి తరపున పోటీ చేసి బాలు చౌహన్ కు 15680 ఓట్లు వచ్చాయి. డీ లిమిటేషన్ తర్వా మహబూబాబాద్ నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయ్యింది.
మొత్తం 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్, ఎస్.పి.పిఎఫ్ చెరోసీటు గెలుచుకున్నాయి.
1972 నుంచి 1989 వరకు వరుసగా ఐదుసార్లు జన్నారెడ్డి జనార్ధన్ రెడ్డి గెలుపొందారు. 1957, 62లలో చిల్లంచెర్ల నియోజకవర్గంలో గెలుపొందిన ఎం.ఎస్ రాజలింగం వరంగల్ లో మరోసారి గెలిచారు. 2004లో ఇక్కడ గెలిచిన టిడిపి నేత వి.నరేందర్ రెడ్డి ఈ నియోజకవర్గం రిజర్వు కావడం వల్ల పోటీ చేయలేక పోయారు.