తెలంగాణ - CLICK HERE

మేడ్చల్
మేడ్చల్

మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,85,202 అందులో పురుషులు -2,52,873  మహిళలు - 2,32,271, థర్డ్ జెండర్  58 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టిఆర్ఎస్ నుంచి ఎంపి చామకూర మల్లారెడ్డి బరిలోకి దిగారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి పి.మోహన్ రెడ్డి , బిఎస్పీ తరపున ఎన్. ప్రభాకర్, బిఎల్ఎఫ్ నుంచి గుజ్జు రమేష్ (బిఎల్పీ) పోటీకి దిగారు. 

రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ,2014 సాధారణ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం విశేషం. ఆయనకు 58106 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎం.సుధీర్ రెడ్డి 43455 ఓట్ల ఆధిక్యతతో టిడిపి సమీప ప్రత్యర్ధి జంగయ్య యాదవ్ పై విజయం సాధించారు. 
మొత్తం 12సార్లు ఎన్నికలు జరగ్గా .. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు గెల్చాయి. టిడిపి నాలుగుసార్లు గెలిచింది. టిఆర్ఎస్ ఒకసారి గెల్చింది.  డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1978లో ఇక్కడ గెలిచాకే ముఖ్యమంత్రి అయ్యారు.  చెన్నారెడ్డి మొత్తం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వికారాబాద్, తాండూరులలో రెండేసి సార్లు, ఒకసారి సనత్ నగర్ లోను ఆయన గెలుపొందారు. 
గతంలో ఈయన నీలం, కాసు మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా నిర్వహించిన చెన్నారెడ్డి నాలుగు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేశారు. ఒకసారి ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. ఇదే సమయంలో మొదలైన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి , తెలంగాణ ప్రజా సమితి పార్టీని విజయపథంలో నడిపించిన ఘనత పొందారు. 
మేడ్చల్ లో రెండుసార్లు గెల్చిన సుమిత్రాదేవి  మరో మూడుసార్లు ఇతర చోట్ల గెల్చారు. టిడిపిలో జెడ్పీ ఛైర్మన్ గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన టి.దేవేందర్ గౌడ్ ఇక్కడ మూడుసార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లలో సభ్యునిగా ఉన్న దేవేందర్ గౌడ్ 2008నాటికి టిడిపిని వదిలి సొంతంగా పార్టీని నవతెలంగాణ పేరిట ఏర్పాటు చేశారు. కొంతకాలం తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేసి 2009లో మల్కాజిగిరి లోక్ సభకు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీకి పోటీ చేసి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నారు. ఆ తర్వాత తిరిగి టిడిపిలో పున ప్రవేశించి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందినవారిలో సుమిత్రాదేవి, ఉమా వెంకట్రామిరెడ్డి, కె.సురేంద్ర రెడ్డిలు కూడా మంత్రులుగా పని చేశారు. 
  

సోనియా రాకతో హోరెత్తిన మేడ్చల్ సభాస్థలి

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా మేడ్చల్ సభకు విచ్చేసారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాం: రమణ

తెలంగాణ ఆత్మగౌరవం కోసం కూటమికిగా పనిచేస్తున్నాం అని టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

గెలిచినా.. ఓడినా కేసీఆర్ ఫాం హౌస్‌లోనే

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కేసీఆర్ ఫాం హౌస్‌కి.. కేటీఆర్ అమెరికాకు

వచ్చే ఎన్నికలలో సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌కి.. మంత్రి కేటీఆర్ అమెరికాకు పారిపోవటం ఖాయం అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మేడ్చల్ సభలో పాటతో హోరెత్తించిన గద్దర్

మేడ్చల్‌ కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్దర్.. 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' అంటూ తన గళాన్ని విప్పారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మేడ్చల్‌ సభకు హాజరైన ఉద్యమ నేతలు

మేడ్చల్  సభకు ప్రజా కూటమి నాయకులు ఆందరూ హాజరయ్యారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

బిడ్డల్ని కలిసేందుకు వచ్చిన తల్లిలా ఉంది

మేడ్చల్ లో మహాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన సోనియాగాంధీ తొలిపలుకుల్లోనే సెంటిమెంట్ రంగరించారు. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,  

కేసిఆర్ కు ఓటేసినా .. వేయకున్నా ఫామ్ హౌసే..

By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram