తెలంగాణ - CLICK HERE

దేవరకొండ
దేవరకొండ

దేవరకొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,01,826 అందులో పురుషులు -1,00,813.  మహిళలు - 1,01,011, థర్డ్ జెండర్  ఇద్దరు ఉన్నారు. 

2018 అసెంబ్లీ  ఎన్నికలకు టిఆర్ఎస్ నుండి తాజా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బాలు నాయక్ పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి డాక్టర్ కళ్యాణ్ నాయక్, బిఎస్పీ నుంచి బిల్యా నాయక్ ఎన్నికల బరిలోకి దిగారు. 


నల్గొండ జిల్లాలో గిరిజనులకు రిజర్వు అయిన దేవరకొండలో 2014 సాధారణ ఎన్నికలో సిపిఐ గెలుపొందింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ తెలంగాణలో ఈ ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. సిపిఐ తరపున గతంలో ప్రాతినిధ్యం వహించిన రమావత్ రవీంద్రకుమార్ రెండోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలూ నాయక్ ఈసారి పోటీ చేయలేదు. ఆయన జిల్లా పరిషత్ కు పోటీ చేశారు. రమావత్ రవీంద్రకుమార్ తన సమీప టిడిపి-బిజెపి కూటమి ప్రత్యర్ధి బిల్యానాయక్ పై 4216 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్ధి కేతావత్ లాలూకి 38618 ఓట్లు వచ్చాయి.
దేవరకొండ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు, సిపిఐ ఏడుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. సిపిఐ నాయకుడు బద్దు చౌహన్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. గిరిజన నేత రవీంద్రనాయక్ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2004లో వరంగల్ లోక్ సభ స్థానం నుంచి టిడిపి తరపున పోటీ చేసి విజయం సాధించారు. దేవరకొండలో టిడిపి ఒక్కసారి గెలవలేదు. రవీంద్రనాయక్ గతంలో భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు. 1999లో ఇక్కడ గెలిచిన రాగ్యానాయక్ 2001 డిసెంబర్ లో నక్సల్స్ కాల్పుల్లో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో రాగ్యానాయక్ భార్య భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం భారతి ఎమ్మెల్సీ కూడా ఎన్నికయ్యారు. 

  

కాంగ్రెస్‌లోకి నల్గొండ జెడ్పీ చైర్మన్?

నల్గొండ జెడ్పీ చైర్మన్ బాలు నాయక్‌... కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్‌ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే సీటును ఆశించిన బాలు నాయక్.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేవరకొండలో టిఆర్ఎస్ అభ్యర్ధి వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం