తెలంగాణ - CLICK HERE

ఆర్మూర్
ఆర్మూర్

ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,70,732. అందులో పురుషులు -  80,325,  మహిళలు - 90,402, థర్డ్ జెండర్ - 5గురు ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ చెప్పిన మాట ప్రకారం తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని మళ్ళీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకుల లలిత పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి పి. వినయ్ కుమార్ రెడ్డి, బిఎస్పీ నుంచి కే.సుధాకర్ బరిలోకి దిగారు. 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు ఓ ప్రత్యేక స్థానముంది. ఈ జిల్లా అనేక మంది నేతలను అందించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి  ఓటమి పాలయ్యారు. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్ధి ఎ.జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 13,964 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీడీపీ-బీజేపీ కూటమి తరపున పోటీ చేసిన విద్యార్థి నాయకుడు డి.రాజారామ్ 7,528 ఓట్లతో  మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడి నుంచి గెలుపొందిన జీవన్ రెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 
ఆర్మూర్ నియోజకవర్గానికి మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఎనిమిదిసార్లు గెల్చాయి. టీడీపీ మూడుసార్లు, టీఆర్ఎస్ రెండుసార్లు, సోషలిస్టు పార్టీ ఒకసారి గెలుపొందింది. 
ఆర్మూర్ నుంచి సంతోష్ రెడ్డి నాలుగుసార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన తుమ్మల రంగారెడ్డి బాల్కొండలో మరోసారి గెల్చారు. రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనతను కూడా సాధించారు. మాజీ సీఎం టి.అంజయ్య ఒకసారి, మాజీ మంత్రి రాజారామ్ మరోసారి ఇక్కడ నుంచి గెలిచారు. 
 

  

టీఆర్ఎస్ చెప్పిన మాట ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మళ్ళీ బరిలోకి దింపింది.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆంధ్ర పెత్తనం...

మళ్లీ మనకు ఆంధ్ర నేతల పెత్తనం అవసరం లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మళ్లీ కేసిఆర్ చేతిలో పెడితే కలగానే బంగారు తెలంగాణ