తెలంగాణ - CLICK HERE
- నియోజకవర్గాలు
- చెన్నూర్
- బెల్లంపల్లి
- మంచిర్యాల
- ధర్మపురి
- రామగుండం
- మంథని
- పెద్దపల్లి

చెన్నూరు ఎస్సీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,61,401 . అందులో పురుషులు - 81,700, మహిళలు - 79,684, థర్డ్ జెండర్ - 17 మంది ఉన్నారు.
2018 ఎన్నికలలకు టిఆర్ఎస్ తమ అభ్యర్ధిగా 2014 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెల్చిన బాల్క సుమన్ ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటేశ్ నేత బోర్లకుంట, తెలంగాణ జన సమితి నుండి నరేష్ పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి ఎ.శ్రీనివాసులు ఎన్నికల బరిలోకి దిగారు. బోడ జనార్ధన్ (బిఎస్పీ) బిఎల్ఎఫ్ నుండి పోటీకి దిగారు.
చెన్నూరు రిజర్వుడ్ నియోజకవర్గంలో 20014 ఎన్నికల్లో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మూడోసారి గెల్చారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి మాజీ మంత్రి వినోద్ ను ఓడించారు. 2009లో గెల్చిన ఓదేలు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదివికి రాజీనామా చేసి రెండోసారి ఉప ఎన్నికలో గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటైన నేపథ్యంలో తిరిగి 26164 ఓట్ల తేడాతో మూడోసారి ఘనవిజయం సాధించారు. బిజెపి-టిడిపి కూటమి తరపున పోటీ చేసిన రామ్ వేణుకు 7879 ఓట్లు మాత్రమే వచ్చి మూడో స్థానంలో ఉన్నారు.
2009లో కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పట్లో కార్మిక శాఖామంత్రిగా ఉన్న జి.వినోద్ ను నల్లాల ఓదేలు 11,474 ఓట్ల తేడాతో ఓడించారు. తెలంగాణ సాధన కోసం పార్టీ నిర్ణయం మేరకు 2010 ఫిబ్రవరిలో అసెంబ్లీకి రాజీనామా చేసి తిరిగి పోటీలో నిలబడి వినోద్ పైనే 44వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో రెండో సారి గెలిచారు. ఇప్పుడు మూడో సారి వినోద్ పై గెలుపొందడం విశేషం.
1962 నుంచి చెన్నూరు రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందితే, టిడిపి ఐదుసార్లు, టిఆర్ఎస్ మూడు సార్లు విజయం సాధించింది. 1983 తర్వాత ఒక్కసారే కాంగ్రెస్ గెలవగలింది. మహాకూటమిలో భాగంగా 2009లో టిఆర్ఎస్ 2009 పోటీ చేసి గెలవగా, ఈసారి సాధారణ ఒంటరిగా పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకుంది.
ప్రముఖ కాంగ్రెస్ నేత కోదాటి రాజమల్లు ఇక్కడ మూడుసార్లు గెలిస్తే.. అంతకముందు సిర్పూరులో ఒకసారి, లక్సెట్టిపేటలో మరోసారి గెల్చారు. టిడిపి తరపున బోడ జనార్ధన్ నాలుగుసార్లు, ప్రముఖ కార్మికనేత , ఏడుసార్లు ఎంపిగా గెల్చిన జి.వెంకటస్వామి కుమారుడు వినోద్ 2004లో ఇక్కడ గెల్చారు.
2014 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెల్చిన బాల్క సుమన్ ను ఈసారి చెన్నూరు నుంచి బరిలోకి దింపింది టీఆర్ఎస్.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ అభ్యర్థి బాల్క సుమన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎర్రగుంట పల్లిలో బాల్క సుమన్ ప్రచారాన్ని ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. నల్లాల ఓదెలును కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో కలిసి సముదాయించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు ఊహించని ఘటన ఎదురైంది. గురువారం యశోద ఆస్పత్రికి వచ్చిన ఓదెలును ఇందారం బాధితుల బంధువులు అడ్డుకుని..పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపీ బాల్క సుమన్ పై తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఇందూరు ప్రచారంలో ఆత్మహత్యకు పాల్పడ్డ తన అనుచరుడు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ దక్కని వారు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే టిక్కెట్లు ఖరారైన వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేయడంతో టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది... టికెట్లను ఆశించనవాళ్లు ఎక్కడిక్కడ ఆందోళనకు దిగుతున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణలో అసెంబ్లీ రద్దు... ఆ వెంటనే 105 సీట్లకు అభ్యర్థుల ప్రకటన టీఆర్ఎస్లో ముసలం పుట్టించింది. తనకు టికెట్ కేటాయించలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్వీయ నిర్భంధం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.