తెలంగాణ - CLICK HERE

ముషీరాబాద్
ముషీరాబాద్

ముషీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,68,536 అందులో పురుషులు -1,40,565  మహిళలు - 1,27,964, థర్డ్ జెండర్  7గురు ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి తరపున తాజా మాజీ ఎమ్మెల్యే లక్షణ్ ఎన్నికల బరిలోకి దిగారు.కాంగ్రెస్ పార్టీ నుంచి  ఎం. అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. టిఆర్ఎస్ నుండి ముఠా గోపాల్  , బిఎల్ఎఫ్ ఎం.నగేష్ ఎన్నికల బరిలో దిగారు. 

బిజెపి సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ రెండోసారి గెలుపొందారు. 1999లో టిడిపితో కూటమి ఉన్నప్పుడు గెలవగా.. మళ్లీ 2014 సాధారణ ఎన్నికలో అదే కూటమి పక్షాన విజయం సాధించారు. టిఆర్ఎస్ సమీప ప్రత్యర్ధి ముఠా గోపాల్ పై 27386 ఓట్ల ఆధిక్యతతో లక్ష్మణ్ గెల్చారు. కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు వినయ్ కుమార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 26808 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. 
గతంలో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య ఇక్కడ నుంచి మూడు సార్లు గెలుపొందగా.. మూడు దశాబ్దాల తర్వాత ఆయన భార్య మణెమ్మ రెండుసార్లు గెలుపొందడం విశేషం. అంజయ్య మరణించిన తర్వాత లోక్ సభ ఎన్నికలలో ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొన్నెళ్లుగా క్రియాశిల రాజకీయాలలో పెద్దగా లేరనే చెప్పాలి. అయితే 2008లో టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహాంలో భాగంగా 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, ముషీరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయిని నరసింహారెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దరిమిలా జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేయించడం కోసం నాటి సిఎం రాజశేఖర్ రెడ్డి అభ్యర్ధుల అన్వేషణ చేసి చివరకి మణెమ్మను ఎంపిక చేశారు.  ఆ ఉప ఎన్నికలో గెలుపొందిన మణెమ్మ 2009 సాధారణ ఎన్నికలోనూ గెలిచారు. ఈ విధంగా భార్యభర్తలిద్దరూ ఎమ్మెల్యేలుగాను, ఎంపిలుగాను పని చేసిన అరుదైన రికార్డును అంజయ్య, మణెమ్మలు సొంతం చేసుకున్నారు. అంజయ్య వివిధ మంత్రివర్గాలలోను, 1981లో ముఖ్యమంత్రిగాను పని చేశారు. సిఎం అయ్యాక మెదక్ జిల్లా రామాయంపేట నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆర్మూరులో గెల్చారు. మొత్తం ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన ఒకసారి ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి పదవి కూడా నిర్వహించారు. ప్రస్తుతం టిఆర్ఎస్ నేతగా ఉన్న నాయిని నరసింహారెడ్డి 1978లో జనతాపార్టీ తరపున పోటీ చేసి అంజయ్యను ఓడించి సంచలనం సృష్టించారు. నాయిని 1978, 1985లలో జనతాపార్టీ తరపున గెలిచారు. తిరిగి 2004లో టిఆర్ఎస్ లో చేరి విజయం సాధించారు. నాయిని 2004లో ఎన్నికైన తర్వాత కొంతకాలం రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ క్యాబినెట్ లో హోమ్ మంత్రి అయ్యారు. తదుపరి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయనతోపాటు హైదరాబాద్ కు చెందిన ముస్లిం నేత మహమూద్ అలీ కూడా ఎమ్మెల్సీ అయ్యి తెలంగాణ తొలి క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రి అవ్వడం విశేషం. 1983లో ఇక్కడ గెలిచిన శ్రీపతి రాజేశ్వర్ 1985, 1999లో సనత్ నగర్ నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి గా కూడా పని చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఎం.కోదండరెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. 1957లో గెలుపొందిన సీతయ్య గుప్తా, 1962లో బేగంబజార్ నుంచి గెలిచారు. 1952లో ఇక్కడ విజయం సాధించిన జి.ఎస్ మేల్కొటే మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 
ముషీరాబాద్ కు 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి తొమ్మిదిసార్లు, జనతాపార్టీ రెండుసార్లు, బిజెపి రెండుసార్లు, టిడిపి, టిఆర్ఎస్ లు ఒక్కోసారి గెలుపొందాయి. 

  

టీఆర్‌ఎస్‌ లో 'ముషీరాబాద్‌' ముసలం

ముషీరాబాద్‌ అసెంబ్లీ సీటు టీఆర్‌ఎస్‌ లో ముసలం పుట్టిస్తుంది. వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒంటరిగానే అన్ని సీట్లకు పోటీ...

తెలంగాణలో మేం ఒంటరిగానే అన్ని సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్... ఎన్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎల్బీ స్టేడియంలో ప్రధాని అధ్యక్షతన బిజెపి బహిరంగ సభ

ముషీరాబాద్ లో చంద్రబాబు రోడ్ షో

By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram