తెలంగాణ - CLICK HERE
- నియోజకవర్గాలు
- జుక్కల్
- బాన్సువాడ
- ఎల్లారెడ్డి
- కామారెడ్డి
- నారాయణ్‌ఖేడ్
- అందోల్
- జహీరాబాద్

జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,74,588. అందులో పురుషులు - 86,326, మహిళలు - 88,243, థర్డ్ జెండర్ - 19 మంది ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు తాజా మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే టి ఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్. గంగారం ఎన్నికల బరిలోకి దిగారు. బిజెపి నుండి అరుణతార, బిఎల్ ఎఫ్ నుండి భరత్ వాగ్మారే(బిఎల్పీ) పోటీకి దిగారు.
1957 నుంచి 1972 వరకు జనరల్ సీటుగా ఉన్న జుక్కల్ 1978 నుంచి రిజర్వుడ్ నియోజకవర్గంగా మారింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి గెల్చిన హనుమంతు షిండే, తెలంగాణ ఉద్యమం బలంగా ఉండటంతో టిఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి 35,507 ఓట్ల ఆధిక్యంతో గెల్చారు. ఇక్కడ నాలుగుసార్లు గెల్చిన కాంగ్రెస్ నేత ఎస్.గంగారామ్ 2014లో కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. టిడిపి అభ్యర్దిగా పోటీ చేసిన ఎం.నవీన్ కుమార్ కు కేవలం 7,469 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) ఐదుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, ముగ్గురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. టిడిపి తరపున పండరి రెండుసార్లు గెల్చారు. జనరల్ సీటుగా ఉన్నప్పుడు విఠల్ రెడ్డి ఇండిపెండెంటుగా రెండుసార్లు గెలవడం విశేషం.
ఈసారి కూడా హనుమంతు షిండే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.