ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
అరకు
అరకు

గతంలో ఉన్న పార్వతీపురం రిజర్వుడ్ పార్లమెంటరీ నియోజకవర్గం రద్దు అయ్యి.. కొత్తగా ఏర్పడిన అరుకు ఎస్టీ నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.  2014 సాధారణ ఎన్నికలలో  ఉత్తరాంధ్ర నుంచి ఈ ఒక్క సీటులోనే ఆ పార్టీ గెలిచింది. కేంద్రమంత్రిగా ఉంటూ ఎన్నికల బరిలోకి దిగిన సీనియర్ కాంగ్రెస్ నేత కిషోర్ చంద్రదేవ్ డిపాజిట్ కోల్పోవడమే కాకుండా దారుణంగా పరాజయం పాలయ్యారు. వైసిపి తరపున పోటీ చేసిన కొత్తపల్లి గీత , టిడిపి అభ్యర్ధి గుమ్మడి సంధ్యారాణిపై 91398 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. గీతకు 413191 ఓట్లు వస్తే.. సంధ్యారాణికి 321793 ఓట్లు వచ్చాయి.. అయితే కొత్తపల్లి గీత లోక్ సభకు ఎన్నికైన కొద్ది నెలలకే వైసిపి కి గుడ్ బై చెప్పి అధికార టిడిపికి దగ్గరయ్యారు. పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసిపికి, ఒక సెగ్మెంట్ లో టిడిపికి మెజార్టీ వచ్చింది. వైసిపికి పాలకొండలో 2084, కురుపాంలో 16354, సాలూరులో 1659, అరకులో 36642, పాడేరులో 28542, రంపచోడవరంలో 10391 ఓట్ల  ఆధిక్యత వచ్చింది. ఇక టిడిపికి పార్వతీపురంలో 5088 ఓట్లు వచ్చాయి. 
అరకు లోక్ సభ స్థానానికి రెండుసార్లు ఎన్నికలు జరగితే.. ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసిపి గెలుపొందాయి. 
అరకులో 2009లో గెలిచిన కిషోర్ చంద్రదేవ్, అంతకుముందు పార్వతీపురంలో నాలుగుసార్లు గెలిచారు. 1977లో కాంగ్రెస్ తరపున గెలిచిన కిషోర్ చంద్రదేవ్, ఆ పార్టీ చీలిక సమయంలో కాంగ్రెస్ యు, తర్వాత కాంగ్రెస్ ఎస్ తరపున రెండుసార్లు గెలుపొందారు. 1984లో టిడిపి మద్దతుతో గెలిచారు. ఆయన చరణ్ సింగ్ క్యాబినెట్ లోను, తిరిగి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోను మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.