ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
అమలాపురం
అమలాపురం

2014 సాధారణ ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున పోటీ చేసిన డాక్టర్ .పి.రవీంద్రబాబు విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి , మాజీ మంత్రి పి.విశ్వరూప్ పై 120576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రవీంద్రబాబుకు 594547 ఓట్లు వస్తే.. విశ్వరూప్ కు 473971 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ ఎంపి బుచ్చి మహేశ్వరరావుకు 12182 ఓట్లు, మరో మాజీ ఎంపి, జై సమైక్యాంధ్ర నుంచి పోటీ చేసిన హర్షకుమార్ కు 9931 ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయారు. 
అమలాపురం పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో టిడిపికే మెజార్టీ వచ్చింది. రామచంద్రాపురంలో 16252, ముమ్మడివరంలో 27252, అమలాపురంలో 13725, రాజోలులో 6951, గన్నవరంలో 12067, కొత్తపేటలో 3407, మండపేటలో 40992 ఓట్ల మెజార్టీని టిడిపి సాధించింది. 
లోక్ సభ స్థానానికి మొత్తం 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు, టిడిపి ఆరుసార్లు గెలిచాయి. కుసుమ కృష్ణమూర్తి మూడుసార్లు, జిఎంసి. బాలయోగి మూడుసార్లు, హర్షకుమార్ రెండుసార్లు గెలుపొందారు. బుచ్చి మహేశ్వరరావు, కె.ఎస్.ఆర్ మూర్తి, గంటి విజయకుమారి, రవీంద్రకుమార్ లు ఒక్కోసారి గెలిచారు. బాలయోగి లోక్ సభ స్పీకర్ గా పని చేసి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన భార్య విజయకుమారిని ఉప ఎన్నికలో ఎన్నుకున్నారు. 

Activities are not Found
No results found.