ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
అనకాపల్లి
అనకాపల్లి

2014 సాధారణ ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయం సాధించారు. అనుహ్యంగా లోక్ సభకు పోటీ చేసిన అవంతి విద్యా సంస్థల అధినేత తన సమీప వైసిపి ప్రత్యర్ధి గుడివాడ అమరనాథ్ పై 47932 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి తోట విజయలక్ష్మి 17770 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. 2014 ఎన్నికల ముందు టిడిపిలో చేరారు అవంతి శ్రీనివాస్. పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుచోట్ల టిడిపికి మెజార్టీ లభిస్తే , వైసిపికి ఒకచోట ఆధిక్యత లభించింది.  టిడిపికి చోడవరంలో 965, అనకాపల్లిలో 19694, పెందుర్తిలో 17503, ఎలమంచిలిలో 9473,  పాయకరావుపేటలో 3250, నర్సీపట్నంలో 1139 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసిపికి మాడుగులలో 3928 ఓట్ల ఆధిక్యత లభించింది. 
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి 14 సార్లు  ఎన్నికలు జరిగితే. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు ... టిడిపి ఐదుసార్లు గెలుపొందాయి. మిస్సుల సూర్యనారాయణమూర్తి గొలుగొండలో ఒకసారి , అనకాపల్లిలో రెండుసార్లు గెలిచారు. ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు మూడుసార్లు, కొణతాల రామకృష్ణ రెండుసార్లు గెలిచారు. అయ్యన్నపాత్రుడు, గుడివాడ గురునాథరావు, గంటా శ్రీనివాసరావు, పి.చలపతిరావు, సబ్బం హరి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒక్కోసారి గెలుపొందారు. 

Activities are not Found
No results found.