ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
బాపట్ల
బాపట్ల

2009లో రిజర్వుడ్ పార్లమెంటరీ నియోజకవర్గంగా మారిన బాపట్లలో టిడిపి అభ్యర్ధి మాల్యాద్రి శ్రీరామ్ విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి వరికూటి అమృతపాణిపై 32754 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీరామ్ కు 578145 ఓట్లు వస్తే, అమృతపాణికి 545391 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి 22493 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను నాలుగుచోట్ల టిడిపికి, మూడుచోట్ల వైసిపికి అధిక్యత లభించింది. టిడిపికి వేమూరులో 3014, రేపల్లెలో 12433, పర్చూరులో 12394, చీరాలలో 9924 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక వైసిపికి బాపట్లలో 2331, అద్దంకిలో 2045, సంతనూతలపాడులో 1150 ఓట్ల అధిక్యత లభించింది. 
బాపట్ల లోక్ సభ స్థానానికి మొత్తం 11సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు గెలిచాయి. బాపట్లలో ఒక్క పి.అంకినీడు ప్రసాదరావు తప్ప , 1984 నుంచి ఎవరూ ఇక్కడ నుంచి రెండోసారి గెలవలేదు. ఈయన ఒంగోలులో కూడా ఒకసారి గెలుపొంది మొత్తం మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. మాజీ సిఎం నేదురుమల్లి ఇక్కడ ఒకసారి గెలవగా, నరసరావుపేట, విశాఖలలో మరో రెండుసార్లు గెలుపొందారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బాపట్లలో ఒకసారి, తెనాలిలో రెండుసార్లు గెలిచారు. దగ్గుబాటి పురందేశ్వరీ బాపట్లలో ఒకసారి, విశాఖలో మరోసారి గెలిచారు. పనబాక లక్ష్మీ ఇక్కడ ఒకసారి, నెల్లూరులో మూడుసార్లు గెలిచారు. చిమటా సాంబు, ఎస్.బెంజిమన్, సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు, మాల్యాద్రి శ్రీరామ్ ఒకసారి గెలిచారు. దగ్గుబాటి దంపతులిద్దరూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం విశేషం. అంకినీడు ప్రసాదరావు కేంద్రమంత్రిగా పని చేశారు. దగ్గుబాటి పురందేశ్వరీ, పనబాక లక్ష్మీ , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్రమంత్రులుగా పని చేశారు. 

Activities are not Found
No results found.