ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

గుంటూరు
గుంటూరు

2014 సాధారణ ఎన్నికలలో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి వి.బాలశౌరిపై 69111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గల్లాకు 618417 ఓట్లు రాగా, బాలశౌరికి 549306 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అబ్దుల్ వాహీద్ షేక్ కు 46818 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారు. జయదేవ్ కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నేత, మంత్రిపదవులు నిర్వహించిన గల్లా అరుణ కుమారుడు. తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో వారిద్దరు టిడిపిలో చేరారు. లోక్ సభ పరిధిలోని 7అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపికి ఆధిక్యత లభించింది. తాడికొండలో 5813, మంగళగిరిలో 5896, పొన్నూరులో 6084, తెనాలిలో 19759, ప్రత్తిపాడులో 9382, గుంటూరు పశ్చిమలో 21051, గుంటూరు తూర్పులో 784 ఓట్ల మెజార్టీ వచ్చింది. 
గుంటూరు లోక్ సభ స్థానానికి 16సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ , కాంగ్రెస్ లు కలిసి 12సార్లు, టిడిపి మూడుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందారు. సీనియర్ నేత కొత్త రఘురామయ్య తెనాలిలో ఒకసారి, గుంటూరులో ఐదుసార్లు మొత్తం ఆరుసార్లు గెలిచారు. సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు గుంటూరులో కాంగ్రెస్ తరపున  నాలుగుసార్లు ,2014లో టిడిపి తరపున నరసరావు పేట నుంచి గెలిచి మొత్తం ఐదుసార్లు గెలుపొందారు. ఎస్.ఎ.ఎల్. నరసింహం , లాల్ జాన్ భాషా, వైవి.రావులు ఒక్కోసారి గెలిచారు. కేంద్రంలో కొత్త రఘురామయ్య సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు. 

Activities are not Found
No results found.