ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

కాకినాడ
కాకినాడ

2014 సాధారణ ఎన్నికలలో కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున పోటీ చేసిన మాజీ మంత్రి తోట నరసింహం విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి చలమలశెట్టి సునీల్ పై 3431 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి ఎం.పల్లంరాజు 19754 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. తోట నరసింహంకు 514402 ఓట్లు రాగా, సునీల్ 510971 ఓట్లు తెచ్చుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను నాలుగింటిలో వైసిపి మెజార్టీ వచ్చినా.. గెలుపు మాత్రం తెలుగుదేశం పార్టీ సాధించింది. టిడిపికి కాకినాడ రూరల్ లో 21271 , పెద్దాపురంలో 13267, కాకినాడ సిటీలో 25583 ఆధిక్యతత వచ్చింది. వైసిపికి తునిలో 12570, ప్రత్తిపాడులో 1904, పిఠాపురంలో 27241, జగ్గంపేటలో 1426 ఓట్ల మెజార్టీ వచ్చింది. 
17 సార్లు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 10సార్లు, టిడిపి ఐదుసార్లు, సిపిఐ ఒకసారి, బిజెపి ఒకసారి గెలిచాయి. 
బి.ఎస్.మూర్తి కాకినాడలో ఒకసారి, ఏలూరులో మరోసారి , అమలాపురంలో మూడుసార్లు మొత్తం ఐదుసార్లు గెలిచారు. స్వాతంత్రయోధుడు మొసలికంటి తిరుమలరావు మూడుసార్లు, ఎం.ఎస్.సంజీవరావు మూడుసార్లు, తోట గోపాలకృష్ణ రెండుసార్లు, ఎం.ఎం.పల్లంరాజు మూడుసార్లు గెలుపొందారు. సిఎ.రామారావు, తోట సుబ్బారావు, ముద్రగడ పద్మనాభం, తోట నరసింహంలు ఒక్కొక్కసారి, నటుడు కృష్ణంరాజు ఇక్కడ ఒకసారి, నర్సాపురంలో మరోసారి గెలిచారు. తిరుమలరావు, సంజీవరావు, పల్లంరాజులు కేంద్రంలో మంత్రులుగా పని చేశారు. నటుడు కృష్ణంరాజు నరసాపురంలో గెలిచాక కేంద్రంలో మంత్రి అయ్యారు. సంజీవరావు, పల్లంరాజులు తండ్రి,కొడుకులు. 

Activities are not Found
No results found.