ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
కర్నూలు
కర్నూలు

2014 సాధారణ ఎన్నికలలో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి బుట్టా రేణుక గెలుపొందారు. ఆమె తన సమీప టిడిపి ప్రత్యర్ధి బిటి.నాయుడుపై 44131 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు 472782 ఓట్లు వస్తే, నాయుడుకి 428651 ఓట్లు లభించాయి. కేంద్రమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి 116603 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగుచోట్ల వైసిపికి, మూడుచోట్ల టిడిపికి అధిక్యత వచ్చింది. వైసిపికి కర్నూలులో 15245, కొడుమూరులో 29069, మంత్రాలయంలో 7729, ఆదోనిలో 15382 ఓట్ల మెజార్టీ లభించింది. టిడిపికి పత్తికొండలో 8391, ఎమ్మిగనూరులో 13676, ఆలూరులో 1123 ఓట్ల అధిక్యత వచ్చింది. అయితే వైసిపి అధినేత జగన్ వైఖరిపై కినుక వహించిన బుట్టా రేణుక 2017లో టిడిపిలో చేరిపోయారు. 
కర్నూలు లోక్ సభ స్థానానికి మొత్తం 17సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి 13సార్లు గెలిచింది. టిడిపి రెండుసార్లు, వైసిపి ఒకసారి, స్వతంత్ర ఒకసారి గెలుపొందారు.  మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి  ఇక్కడ ఆరుసార్లు గెలిస్తే, ఆయన కుమారుడు సూర్యప్రకాష్ మూడుసార్లు. సోదరుడు కోదండరామిరెడ్డి ఒకసారి గెలిచారు. ఒవి.ఖాన్ ఇక్కడ ఒకసారి, అనంతపురంలో మరోసారి గెలుపొందారు. హెచ్.సీతారామిరెడ్డి, వై.లింగన్నగౌడ్, కె.ఇ.కృష్ణమూర్తి, యశోదరెడ్డి, బుట్టా రేణుక ఒక్కోసారి గెలిచారు. విజయభాస్కరరెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి ఇద్దరూ కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టారు. 

Activities are not Found
No results found.