ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

నర్సారావుపేట
నర్సారావుపేట

2014 సాధారణ ఎన్నికలలో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి  టిడిపి తరపున పోటీ చేసిన సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి అయోధ్య రామిరెడ్డిపై 35280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  రాయపాటికి 632464 ఓట్లు రాగా, రామిరెడ్డికి 597184 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొండపల్లి వెంకటేశ్వర్లకు22943 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయారు. నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలోని రెండుచోట్ల తప్ప మిగిలిన అసెంబ్లీ సెగ్మంట్ల టిడిపికి అధిక్యత లభించింది. టిడిపికి పెదకూరపాడులో 8857, చిలకలూరిపేటలో 8408, సత్తెనపల్లిలో 2314, వినుకొండలో 19582, గురజాలలో 4499 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసిపికి నరసారావుపేటలో 5699, మాచర్లలో 2485 ఓట్లు వచ్చాయి. 
నరసరావుపేట లోక్ సభ స్థానికి మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు, టిడిపి నాలుగుసార్లు, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడ నుంచి లోక్ సభ కు రెండుసార్లు ఎన్నికయ్యారు. మద్ది సుదర్శనం రెండుసార్లు గెలిచారు. మాజీ సిఎం నేదురుమల్లి నరసరావుపేట, బాపట్ల, విశాఖలో ఒక్కోసారి ఎన్నికయ్యారు. మరో మాజీ సిఎం రోశయ్య కూడా గతంలో ఒకసారి ఇక్కడ నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసారావుపేట, ఒంగోలులలో ఒకసారి, నెల్లూరులో మూడుసార్లు చొప్పున మొత్తం ఐదుసార్లు ఎన్నికయ్యారు.  రాయపాటి సాంబశివరావు కూడా ఇక్కడ ఒకసారి, గుంటూరులో నాలుగుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి రెండుసార్లు, కాటూరి నారాయణస్వామి, కోట సైదయ్య, సిఆర్.చౌదరి, ఎం.వేణుగోపాలరెడ్డిలు ఒక్కోసారి గెలిచారు. 

Activities are not Found
No results found.