ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం

2014 సాధారణ ఎన్నికలలో రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి, నటుడు మాగంటి మురళీమోహన్ గెలిచారు. ఆయన వైసిపి అభ్యర్ధి బి.వెంకటరమణపై 167434 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వెంకటరమణకు 463139 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ కు 21243 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 2009 ఎన్నికలలో మురళీమోహన్ ఓడిపోయినా, 2014 ఎన్నికలలో గెలుపొందారు. వైసిపి అభ్యర్ధి వెంకటరమణ , ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కుమారుడు. మొదట టిడిపిలో ఉండి, తర్వాత వైసిపిలో చేరి కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. అయితే వైసిపి ఓటమి తర్వాత తిరిగి టిడిపిలోకి జంప్ కొట్టారు. రాజమహేంద్రవరం లోక్ సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపికి మెజార్టీ లభించింది. అనపర్తిలో 8576, రాజానగరంలో 13484, రాజమహేంద్రవరం సిటీలో 59547, రాజమహేంద్రవరం రూరల్ లో 35892, కొవ్వూరులో 18466, నిడదవోలు 15390, గోపాలపురంలో 15064 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 
రాజమహేంద్రవరం లోక్ సభ స్థానానికి 17సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 10సార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి రెండుసార్లు, సిపిఐ, సోషలిస్టు పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. సీనియర్ నేతలు డిఎస్.రాజు, ఎస్పీబి.పట్టాభిరామారావులు మూడుసార్లు, ఉండవల్లి అరుణకుమార్ రెండుసార్లు గెలిచారు. మిగిలిన వారిలో కావేటి మోహన్ రావు, ఎస్.రెడ్డి నాయుడు, చుండ్రు శ్రీహరి, జమున, కెవిఆర్.చౌదరి, చిట్టూరి రవీంద్ర, జి.వెంకటస్వామి నాయుడు, ఎస్.పి.బి.కె. సత్యనారాయణరావు, మురళీమోహన్ లు ఒక్కోసారి గెలిచారు. 1984 నుంచి జరిగిన ఎన్నికలలో ఒక్క ఉండవల్లి మాత్రమే వరుసగా రెండుసార్లు గెలుపొందారు. సోదరులైన పట్టాభిరామారావు, సత్యనారాయణరావులిద్దరు  కేంద్రమంత్రులుగా పని చేశారు. డిఎస్.రాజు కూడా కేంద్రమంత్రి అయ్యారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram