ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
శ్రీకాకుళం
శ్రీకాకుళం

2014 సాధారణ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. తన సమీప వైసిపి ప్రత్యర్ధి రెడ్డి శాంతి పై 127692 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి ఎరన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు. 2014 ఎన్నికల ముందు ఎర్నన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ప్రజలలో సానుభూతి వెల్లువెత్తింది. రామ్మోహన్ కు 556545 ఓట్లు  వస్తే, రెడ్డి శాంతికి 428853 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి 24171 ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపి మెజార్టీ సాధించింది. ఇచ్ఛాపురంలో 28109, పలాసలో 23189, టెక్కలిలో 18842, పాతపట్నంలో 167, శ్రీకాకుళంలో 34947, ఆముదాల వలసలో 9412, నరసన్నపేటలో 11229 ఓట్ల మెజార్టీని సాధించింది. 
శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిపి 8సార్లు గెలిస్తే.. టిడిపి ఆరుసార్లు, స్వతంత్ర పార్టీ రెండుసార్లు, ఇండిపెండెంటు ఒకరు గెలుపొందారు. 
సీనియర్ కాంగ్రెస్ నేత బొడ్డేపల్లి రాజగోపాలరావు అత్యధికంగా ఆరుసార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. సీనియర్ నేత గౌతు లచ్చన్న ఒకసారి అసెంబ్లీకి, లోక్ సభకు పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. అయితే లోక్ సభ సీటును వదులుకుని తన రాజకీయ గురువు ఎన్జీ రంగాను నిలబెట్టి గెలిపించారు. ఎర్రన్నాయుడు నాలుగుసార్లు, అప్పయ్యదొర,  కణితి విశ్వనాథం రెండుసార్లు, కిల్లి కృపారాణి ఒకసారి, రామ్మోహన్ నాయుడు ఒకసారి గెలిచారు. ఎర్నన్నాయుడు, కృపారాణిలు కేంద్రమంత్రులుగా పని చేశారు. 

Activities are not Found
No results found.