ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

విజయవాడ
విజయవాడ

2014 సాధారణ ఎన్నికలలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి, కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి కోనేరు రాజేంద్రప్రసాద్ పై 74714 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 592953 ఓట్లు రాగా, కోనేరుకు 518239 ఓట్లు వచ్చాయి.  లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఆరుచోట్ల టిడిపి, వైసిపి ఒకచోట ఆధిక్యత సాధించింది. టిడిపికి విజయవాడ పశ్చిమలో 12190, సెంట్రల్ లో 23258, తూర్పులో 22254, మైలవరంలో 7704, నందిగామలో 5406, జగ్గయ్యపేటలో 4377 ఓట్ల మెజార్టీ వచ్చింది.  వైసిపికి తిరువూరులో 413 ఓట్ల ఆధిక్యత లభించింది. 
విజయవాడ లోక్ సభ స్థానానికి మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 11సార్లు, టిడిపి నాలుగుసార్లు, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్.రావు విజయవాడలో మూడుసార్లు గెలవగా, ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోడె మురహరి ఇక్కడ గెలిచాక లోక్ సభ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు రెండుసార్లు, చెన్నుపాటి విద్య రెండుసార్లు, పర్వతనేని ఉపేంద్ర రెండుసార్లు, లగడపాటి రాజగోపాల్ రెండుసార్లు గెలిచారు. హరిశ్చంద్ర చటోపాధ్యాయ, అచ్చమాంబ, గద్దె రామ్మోహన్, కేశినేని శ్రీనివాస్ లు ఒకసారి గెలిచారు. కెఎల్.రావు కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉపేంద్ర టిడిపి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి అయ్యారు. 

Activities are not Found
No results found.