ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

విశాఖపట్నం
విశాఖపట్నం

2014 సాధారణ ఎన్నికలలో విశాఖ పార్లమెంటరీ నియోజవర్గం నుంచి బిజెపి సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి వైఎస్. విజయమ్మపై 90488 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి గౌరవ అధ్యక్షురాలైన విజయమ్మ ఓటమిపాలు కావడం సంచలనమైంది. హరిబాబుకు 566832 ఓట్లు రాగా, విజయమ్మకు 476344 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బి.సత్యనారాయణకు 50632 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. బిజెపికి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ రావడం విశేషం. ఎస్.కోటలో 8074, భీమిలిలో 11952, విశాఖ తూర్పులో 17492, విశాఖ దక్షిణలో 3516, విశాఖ ఉత్తరంలో 26103, విశాఖ పశ్చిమలో 18338, గాజువాకలో 5223 ఓట్లు ఆధిక్యతను బిజెపి సాధించింది. ఇప్పటి వరకు విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు, టిడిపి మూడుసార్లు, బిజెపి ఒకసారి గెలిచాయి. అయితే ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్లు ఐదుగురు గెలపొందడం ఒక ప్రత్యేకత. అయితే ఇద్దరు అన్నదమ్ములు కూడా గెలవడం మరో ప్రత్యేకత. పివిజి.రాజు, ఆయన సోదరుడు విజయానంద్ రెండుసార్లు గెలవగా, ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లంక సుందరం, మల్లుదొర, తెన్నేటి విశ్వనాథం, ఒక్కోసారి గెలవగా, పివిజి.రాజు రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలుపొందడం విశేషం. టిడిపి సీనియర్ నేత ఎంవివిఎస్ మూర్తి రెండుసార్లు, కాంగ్రెస్ నేత టి.సుబ్బిరామిరెడ్డి రెండుసార్లు గెలిచిన వారిలో ఉన్నారు.  ద్రోణంరాజు సత్యనారాయణ, కె.అప్పలస్వామి, భాట్టం శ్రీరామమూర్తి, ఉమా గజపతిరాజు ఒక్కోసారి గెలిచారు. మాజీ సిఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి విశాఖలో ఒకసారి, బాపట్ల, నరసారావుపేటలో ఒకోసారి గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరీ బాపట్లలో ఒకసారి, విశాఖలో మరోసారి గెలుపొందారు. పివిజి.రాజు, సుబ్బిరామిరెడ్డి, పురంధేశ్వరిలు కేంద్రంలో మంత్రులుగా పని చేశారు. 

Activities are not Found
No results found.