తెలంగాణ - CLICK HERE

ఆదిలాబాద్
ఆదిలాబాద్

ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ తరుపున మాజీ మంత్రి గొడం నగేష్ పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు 430847 ఓట్లు పోల్ అవ్వగా.. సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి నరేష్ కు 259557 ఓట్లు వచ్చాయి. దాంతో నగేష్ కు 171290 ఓట్ల ఆధిక్యత లభించింది. టిడిపి నుంచి పోటీ చేసిన రమేష్ రాథోడ్ కు 184198 ఓట్లు, బిఎస్పీ అభ్యర్ధి రాథోడ్ సదాశివకు 94420 ఓట్లు వచ్చాయి. రమేష్ రాథోడ్ 2009లో గెలుపొందినా .. 2014లో మూడో స్థానానికే పరిమితమయ్యారు. 
వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ కు సిర్పూరులో 1262, ఆసిఫాబాద్ లో 35576 ఓట్లు, ఖానాపూర్ లో 38659, ఆదిలాబాద్ లో 35185, భోధ్ లో 34115, నిర్మల్ లో 17044 ఓట్లు ఆధిక్యత వచ్చింది. 
ఇక కాంగ్రెస్ పార్టీకి మధోల్ లో మాత్రం 13190 ఓట్లు ఆధిక్యత వచ్చింది. అంటే ఆరుచోట్ల టిఆర్ఎస్ , ఒకచోట కాంగ్రెస్ మెజార్టీ సంపాదించుకున్నాయి. 
ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఇంతవరకు 17సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐ మూడుసార్లు, టిడిపి ఆరుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఒకసారి సోషలిస్టు పార్టీ గెలిచింది. 
ఆదిలాబాద్ లోక్ సభకు ఎస్. వేణుగోపాలాచారి మూడుసార్లు గెలిచారు.  ఆ తర్వాత సి.మాధవరెడ్డి, పి.గంగారెడ్డి, జి.నరసింహారెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి రెండేసిసార్లు గెలిచారు. ఆశన్న, జి. నారాయణరెడ్డి, నర్సారెడ్డి, మధుసూధనరెడ్డి, రమేష్ రాథోడ్, జి.నగేష్ లు ఒక్కొసారి గెలిచారు. 
పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 1980లో గెలిచిన జి.నరసింహారెడ్డిదే అత్యధిక మెజార్టీ. 181955 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 నుంచి ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. 

Activities are not Found
No results found.