తెలంగాణ - CLICK HERE

కరీంనగర్
కరీంనగర్

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ సీనియర్ నేత బి.వినోద్ కుమార్ మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అంతకుముందు హన్మకొండ నుంచి రెండుసార్లు గెలిచారు. 2009లో ఆ నియోజకవర్గం రిజర్వుడు కావడంతో కరీంనగర్ కు మారి ఓటమిపాలైనా 2014లో 204652 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వినోద్ కుమార్ కు 505358 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపి పొన్నం ప్రభాకర్ కు 300706 ఓట్లు వచ్చి ఓడిపోయారు. టిడిపి మద్దతుతో పోటీ చేసిన బిజెపి నేత చెన్నమనేని విద్యాసాగర్ రావుకు 254828 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. 
లోక్ సభ నియోజకవర్గంలోని ఆరు సెగ్మెంట్లలో టిఆర్ఎస్ కు అధ్యికత రాగా, ఒక సెగ్మెంట్ లో బిజెపికి మెజార్టీ వచ్చింది. కరీంనగర్ లో 13207. చొప్పదండిలో 34005, సిరిసిల్లలో 35319, మానకొండూరులో 33809, హుజురాబాద్ లో 37289, హుస్నాబాద్ లో 23046 ఓట్ల అధిక్యత టిఆర్ఎస్ కు వచ్చింది. ఇక వేములవాడలో బిజెపికి 5649 ఓట్ల మెజార్టీ వచ్చింది.  వేములవాడలో టిఆర్ఎస్ రెండోస్థానంలో నిలిస్తే.. మిగిలిన అన్నిచోట్ల కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 
మొత్తం రెండు ఉపఎన్నికలతో సహా 18సార్లు ఎన్నికలు జరిగాయి. రెండుసార్లు ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. కాంగ్రెస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐ ఐదుసార్లు, టిఆర్ఎస్ నాలుగుసార్లు, బిజెపి రెండుసార్లు, టిడిపి, తెలంగాణ ప్రజా సమితి, ఎస్సీఎఫ్, పిడిఎఫ్ ఒకసారి, గెలిచాయి. 
టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఇక్క ఒకే టెర్మ్ లో మూడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 2004లో గెలిచిన తర్వాత రెండుసార్లు తెలంగాణ ఉద్యమలో భాగంగా రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 
2009లో మహబూబ్ నగర్ నుంచి 2014లో మెదక్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు లోక్ సభకు శాసనసభకు పోటీ చేసి అన్నిసార్లు గెలిచిన నేతగా కూడా కేసిఆర్ చరిత్ర సృష్టించారు. 
ఎమ్.ఆర్. కృష్ణ ఇక్కడ రెండుసార్లు, పెద్దపల్లిలో రెండుసార్లు గెల్చారు. జె.చొక్కారావు మూడుసార్లు, ఎమ్.సత్యనారాయణరావు మూడుసార్లు(రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టిపిఎస్) వినోద్ కుమార్ రెండుసార్లు హన్మకొండలోనూ,ఇక్కడ ఒకసారి, విద్యాసాగరరావు రెండుసార్లు గెలిచారు. మరో నేత జె.రమాపతిరావు రెండుసార్లు నెగ్గారు. బద్దం ఎల్లారెడ్డి, ఎం.శ్రీరంగారావు, ఎల్.రమణ, పొన్నం ప్రభాకర్ లు ఒక్కోసారి గెలిచారు. 

Activities are not Found
No results found.