తెలంగాణ - CLICK HERE

మహబూబ్ నగర్
మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి ఎపి జితేందర్ రెడ్డి , కేంద్రమాజీమంత్రి ఎస్.జైపాల్ రెడ్డిపై విజయం సాధించారు.  10ఏళ్లపాటు కేంద్రమంత్రిగా పని చేసిన జైపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి 2590 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. జితేందర్ రెడ్డికి 334228 ఓట్లు వస్తే.. జైపాల్ రెడ్డికి 331638 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి మరో సీనియర్ నేత , మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి 272791 ఓట్లతో మూడోస్థానంలో మిగిలారు.  వైసిపి తరపున పోటీ చేసిన ఎ.రహమాన్ కు కేవలం 9105 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 
లోక్ సభ నియోజకవర్గంలోని మూడుచోట్ల టిఆర్ఎస్ , మూడుచోట్ల బిజెపి మెజార్టీ సాధించగా, ఒకచోట కాంగ్రెస్ గెలిచింది. 
మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు, కాంగ్రెస్ ఐ ఐదుసార్లు, టిపిఎస్  ఒకసారి, జనతా, జనతాదళ్ , బిజెపి ఒక్కొక్కసారి గెలవగా.. టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. 
కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ మహబూబ్ నగర్ లో నాలుగుసార్లు గెలుపొందగా, మెదక్ లో రెండుసార్లు గెలిచారు. వీటిలో ఒకసారి టిపిఎప్ తరుపున నెగ్గారు. మరో నేత ఎస్ . జైపాల్ రెడ్డి ఇక్కడ రెండుసార్లు, మిర్యాలగూడలో రెండుసార్లు, చేవెళ్లలో ఒకసారి గెలుపొందారు.  జైపాల్ రెడ్డి జనతా, జనతాదళ్ ల నుంచి గెలవగా, మూడుసార్లు కాంగ్రెస్ తరపున గెల్చారు. జితేందర్ రెడ్డి గతంలో బిజెపి తరపున ఒకసారి, 2014 సాధారణ ఎన్నికలో టిఆర్ఎస్ తరపున గెలిచారు. జితేందర్ రెడ్డి 2009లో టిడిపి తరపున చేవెళ్లలో పోటీ చేసి జైపాల్ రెడ్డిపై ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. 
జె.రామేశ్వరరావు ఇక్కడ నుంచి నాలుగుసార్లు, ఒకసారి గద్వాల నుంచి గెలిచారు. జెబి.ముత్యాలరావు ఇక్కడ రెండుసార్లు, నాగర్ కర్నూల్ లో ఒకసారి గెలిచారు. మరోనేత పి.రామస్వామి రెండుసార్లు నెగ్గారు. విఠల్ రావు, జనార్ధనరెడ్డిలు ఒక్కోసారి గెలుపొందారు. టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మహబూబ్ నగర్ లో ఒకసారి, కరీంనగర్ లో మూడుసార్లు , మెదక్ నుంచి ఒకసారి గెలుపొందారు. ఒకే టర్మ్ లో రెండుసార్లు రాజీనామా చేసి గెలుపొందడం ఒక రికార్డు., 
కేంద్రంలోను, ఉమ్మడిరాష్ట్రంలో కూడా మంత్రిగా పని చేశారు.  జైపాల్ రెడ్డి సుదీర్ఘకాలం కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ముత్యాలరావు, మల్లిఖార్జున్ కూడా కేంద్రంలో మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.