తెలంగాణ - CLICK HERE

నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్

నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 2014 సాధారణ ఎన్నికలో సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య గెలిచారు. కాంగ్రెస్ తరపున ఎవరూ పోటీ చేయడానికి సిద్ధపడకపోతే ఆయన పేరును అధిష్టానం ఖరారు చేసింది. అనుహ్యంగా నంది ఎల్లయ్య విజయం సాధించడం సంచలనమేనని చెప్పాలి. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ ఎంపి మందా జగన్నాథంపై 16676 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 
ఎల్లయ్యకు 420075 ఓట్లు రాగా, మందా జగన్నాథంకు 403399 ఓట్లు వచ్చాయి. టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులుకు 183352 ఓట్లు వచ్చి మూడోస్థానంలో ఉన్నారు. వైసిపి తరపున పోటీ చేసిన ఎం.గోపాల్ కు 22985 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్, రెండుచోట్ల టిఆర్ఎస్ ఆధిక్యత సాధించాయి. 
నంది ఎల్లయ్య సిద్దిపేటలో ఐదుసార్లు గెలిచారు. రెండుసార్లు రాజ్యసభకు, ఒకసారి శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నేత డాక్టర్ మందా జగన్నాథం టిడిపి తరపున మూడుసార్లు గెలిచారు. 2009 ఎన్నికల ముందు అణు ఒప్పందం విషయంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు.  ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ తరపున గెలిచారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని వదిలి టిఆర్ఎస్ లో చేరారు. కాని 2014 సాధారణ ఎన్నికలో ఓటమిపాలయ్యారు. 
జెబి.ముత్యాలరావు ఇక్కడ రెండుసార్లు, మహబూబ్ నగర్ లో ఒకసారి గెలిచారు. తులసీరామ్ ఇక్కడ ఒకసారి, పెద్దపల్లిలో రెండుసార్లు గెలుపొందారు. డాక్టర్ మల్లురవి రెండుసార్లు గెలుపొందగా, భీష్మదేవ్ మల్లు అనంతరాములు కూడా రెండేసిసార్లు గెలిచారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram