తెలంగాణ - CLICK HERE

నల్గొండ
నల్గొండ

నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి మూడోసారి గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికలో కేవలం ఇద్దరే కాంగ్రెస్ తరుపున గెలిస్తే .. వారిలో ఒకరు నంది ఎల్లయ్య , మరోకరు గుత్తా సుఖేందర్ రెడ్డే. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి టి.చిన్నపరెడ్డిపై 193156 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గుత్తాకు 472093 ఓట్లు రాగా, చిన్నపరెడ్డికి 278937 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన పి.రాజేశ్వరరెడ్డికి 260677 ఓట్లు వచ్చి మూడోస్థానంలో మిగిలారు. సిపిఎం అభ్యర్ధి ఎన్.నరసింహారెడ్డికి 54423 ఓట్లు, వైసిపి అభ్యర్ధి జి.నాగిరెడ్డికి 39385 ఓట్లు వచ్చాయి. వీరిద్దరు డిపాజిట్లు కోల్పోయారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ , 
ఒకచోట టిఆర్ఎస్ కు మెజార్టీ వచ్చింది. 
అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కారణంగా గుత్తా సుఖేందర్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరిపోయారు. 
నల్గొండలో పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్ నాలుగుసార్లు, కాంగ్రెస్ ఐ నాలుగుసార్లు, సిపిఐ ఐదుసార్లు, టిపిఎస్ ఒకసారి, టిడిపి ఒకసారి గెలుపొందాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి మూడుసార్లు, సిపిఐ సీనియర్ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి రెండుసార్లు, ధర్మబిక్షం రెండుసార్లు, రావి నారాయణరెడ్డి రెండుసార్లు, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఒకసారి గెలుపొందారు. అచ్చాలు, డి.రాజయ్య, ఎం.పెద్దయ్య, సలీం, రామకృష్ణారెడ్డి, లతీఫ్, దామోదర్ రెడ్డి, రఘుమారెడ్డి, చకిలం శ్రీనివాసరావు ఒక్కొసారి విజయం సాధించారు. 

Activities are not Found
No results found.