తెలంగాణ - CLICK HERE

పెద్దపల్లి
పెద్దపల్లి

తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం ఒకటి. తెలంగాణ విద్యార్ధి ఉద్యమ నేతలలో ఒకరైన బాల్క సుమన్.. టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బాల్క సుమన్ 291158 ఓట్ల ఆధిక్యంతో సంచలన విజయం సాధించారు. 2009లో గెలిచిన గడ్డం వివేక్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. టిడిపి తరపున పోటీ చేసిన డాక్టర్ జె.శరత్ బాబుకు కేవలం 63334 ఓట్లే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. టిఆర్ఎస్ కు 565496 ఓట్లు, కాంగ్రెస్ కు 274338 ఓట్లు వచ్చాయి. 
సుమన్ కు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ అధ్యకత లభించింది.  చెన్నూరులో 27259, బెల్లంపల్లిలో 42776, మంచిర్యాలలో 57301, ధర్మపురిలో 24705, రామగుండలో 50970, మంథనిలో 18018, పెద్దపల్లిలో 68744 ఓట్లు మెజార్టీ రావడం విశేషం. 
1962 నుంచి రిజర్వుడు స్థానంగా ఉన్న పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలో 15సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మూడుసార్లు, కాంగ్రెస్ ఐ ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, తెలంగాణ ప్రజాసమితి ఒకసారి, టిఆర్ఎస్ ఒకసారి గెల్చాయి. 
సీనియర్ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలవగా, సిద్ధిపేట లో మరో మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎమ్.ఆర్.కృష్ణ ఇక్కడ రెండుసార్లు, కరీంనగర్ నుంచి రెండేసిసార్లు గెల్చారు. మరో నేత వి.తులసిరామ్ ఇక్కడ రెండుసార్లు, నాగర్ కర్నూలులో ఒకసారి , గొట్టే భూపతి, సుగుణకుమారిలు రెండుసార్లు గెలిచారు. కె.రాజమల్లు, వివేక్, బాల్క సుమన్ ఒక్కోసారి గెలిచారు. అయితే అందరికన్నా అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా బాల్క సుమన్ రికార్డుకెక్కారు. 

Activities are not Found
No results found.