తెలంగాణ - CLICK HERE

వరంగల్
వరంగల్

2014 సాధారణ ఎన్నికలో ఎస్సీలకు రిజర్వు అయిన వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో సీనియర్ నేత , టిఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరి ఘనవిజయం సాధించారు. టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సిఎం కేసిఆర్ కు లోక్ సభలో వచ్చిన మెజార్టీతో దాదాపు సమానంగా వచ్చింది. 
కడియం శ్రీహరికి 392574 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కడియంకు 661339 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్యకు 269065 ఓట్లు దక్కాయి. తెలంగాణ ఉద్యమం కోసం కడియం శ్రీహరి టిడిపిని వీడి టిఆర్ఎస్ లో చేరి విజయం సాధించగా, తెలంగాణ సాధనలో భాగంలో పార్లమెంటు మెట్ల మీద కూర్చుని నిరసన తెలిపిన రాజయ్య పరాజయం పాలవడం విశేషం. కడియం శ్రీహరి ఎంపిగా ఎంపికైనా .. ఆరు నెలల తర్వాత తెలంగాణ డిప్యూటీ సిఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. 
టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి ఎస్.పరమేశ్వర్ కు 187139 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ ఆధిక్యత సాధించింది. 
వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రెడ్డివారి సురేంద్రరెడ్డి మూడుసార్లు, మహబూబాబాద్ లో ఒకసారి  మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఎస్.బి.గిరి, చందూలాల్ రెండుసార్లు గెలుపొందారు. ఎస్.ఎ.ఖాన్ ఇక్కడ ఒకసారి , ఇబ్రహీంపట్నంలో మరోసారి గెలిచారు. బిఎ.మీర్జా కూడా ఇక్కడ ఒక్కసారి, సికింద్రాబాద్ లో మరోసారి గెలుపొందారు. పి.రాఘవరావు, జిఎం.రావు, కల్పనదేవి, బి.వెంకటేశ్వర్లు, రవీంద్ర నాయక్, దయాకరరావు, ఎస్.రాజయ్యలు ఒక్కోసారి గెలిచారు. 

Activities are not Found
No results found.