అల్లు అర్జున్ ట్రిక్ కు 25 లక్షలు 

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ గత వారమే "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా, కొడుకుగా, ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రం కోసం నూటికి నూరు శాతం బ్లడ్ పెట్టి కష్టపడ్డాడు బన్నీ. కేవలం పాత్ర కోసమే కాకుండా...లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాటలో క్యాప్ ట్రిక్ కోసం కూడా ఎంతో శ్రమించాడు. సినిమాలో ఆ పాట చూస్తున్నప్పుడు బన్నీ కష్టం కనపడుతోంది. ఇక రిలీజ్ కు ముందుకు ఈ క్యాప్ ట్రిక్ ను బన్నీ ఎలా నేర్చుకున్నాడో..మనకు చూపించడానికి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా..ఎలా నేర్చుకున్నాడో..ఎంత శ్రమపడ్డాడో మొత్తం చూపించారు. ఇప్పుడా వీడియో దాదాపు 25 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇలా ఓ మేకింగ్ వీడియోకి సోషల్ మీడియాలో ఇలా బ్రహ్మరథం పట్టడంతో మెగా అభిమానాలు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ఈనెల 10న జరగనున్న థాంక్స్ తో ఇండియా మీట్ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.