ఉద్యోగ సంఘాల నేతా.. రాజకీయ సంఘాల నేతా

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఉద్యోగ సంఘాల నేత, రాజకీయ సంఘాల నేతా చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి.. అశోక్ బాబు పొలిటికల్ బ్రోకర్‌గా కర్ణాటక వచ్చి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆయన విమర్శించారు. అశోక్ బాబు ముసుగు భయటపడిందని.. విభజన ఉద్యమంలోనూ దళారీగా వ్యవహరించారని..తొమ్మిది నెలల్లో రిటైర్ అయ్యే వ్యక్తి ఉద్యోగులను రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు విష్ణు.