బీజేపీ, వైసీపీ కొత్త కుట్ర: కంభంపాటి

ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహనరావు అన్నారు. ఈ వ్యవహారంలో కావాలనే చంద్రబాబు పేరును పదేపదే లేవనెత్తుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ చేతులు కలిపి తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందన్నారు. తాము ప్రజా ప్రయోజనాల కోసం ఆలోచిస్తుంటే.. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తోందన్నారు. అవగాహన లేకుండా ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడొద్దని హితవు పలికారు. ఇప్పటికైనా వైసీపీ పేరు వైఎస్‌ఆర్‌బీజేపీ అని మార్చుకుంటే మేలని ఎద్దేవా చేశారు.